పెళ్లి చేసుకోవాలంటూ మహిళ వేధింపులు.. ఎస్ఐ ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ డిసెంబర్ 2న ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. ఆయన ఆత్మహత్యకు ఓ మహిళ వేధింపుల కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో నిందితురాలిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ బండారి కుమార్ మీడియాకు తెలిపారు.

డిసెంబర్ 2న ఉదయం వాజేడు మండలం మల్లెకట్ట వారధి సమీపంలోని ఓ రిసార్టులో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఎస్ఐ హరీశ్. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియతండాడాకు చెందిన బానోతు అనసూర్య అలియాస్ అనుషపైఅనుమానం వచ్చి అమెను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు.

Woman harassed to get married Vajedu SI commits suicide

అనూష ఓ కాలేజీలో అడ్మిన్ స్టాఫ్‌గా విధులు నిర్వహిస్తోంది. ఏడు నెలల
క్రితం రాంగ్ కాల్ ద్వారా ఎస్ఐని పరిచయం చేసుకుని, ఆయనను పెళ్లి చేసుకుంటే జీవితంలో స్థిరపడవచ్చని భావించింది. ఈ క్రమంలో తరచూ ఎస్ఐ హరీశ్‌కు ఫోన్ చేస్తూ సాన్నిహిత్యం పెంచుకుంది. ఆ తర్వాత నను పెళ్లి చేసుకోవాలని హరీశ్‌పై ఒత్తిడి తెచ్చింది. అయితే, ఆయన నిరాకరించారు. దీంతో తనను శారీరకంగా ఉపయోగించుకుని తిరస్కరిస్తున్నట్లు మీడియా, ఉన్నతాధికారులకు చెబుతానంటూ ఎస్ఐని భయాందోళనలనకు గురిచేసింది.

అంతేగాక, తనను పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోవాలంటూ ఎస్ఐ హరీశ్‌ను నిందితురాలు వేధింపులకు గురిచేసింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన హరీశ్ బనవర్మణానికి పాల్పడ్డారు. ఈ మేరకు విచారణలో తేలడంతో నిందితురాలిపై కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఆమెను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

కాడా, ఏడు నెలల క్రితం బాధిత ఎస్ఐకి ఆ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో రిక్వెస్ట్‌ పంపించగా.. అందుకు ఎస్సై హరీశ్‌ కూడా అంగీకరించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య తరచూ ఇన్‌స్టాగ్రామ్‌ చాటింగ్‌ కొనసాగింది. ఈ క్రమంలోనే యువతి ఎస్సైకి దగ్గరైంది. ఆమె హైదరాబాద్‌లో చదువుకుంటూ వారాంతపు సెలవుల్లో వాజేడుకు వచ్చేది. రెండు రోజులు అక్కడే ఉండి వెళ్లేది. ఈ క్రమంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎస్సై ఆ మహిళ గురించి ఆరా తీశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన 26 ఏళ్ల ఆ యువతిది చిలుకూరు మండలం. ఊళ్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహం చేసిందని, అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందనే విషయాలు ఎస్సై తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో పెళ్లికి ఎస్సై నిరాకరించాడు. ఈ క్రమంలో ఆమె ఎస్ఐని వేధించడం ప్రారంభించింది. నిందితురాలి వేధింపులు భరించలేక ఎస్ఐ హరీశ్ డిసెంబర్ 2న ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+