Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓరుగల్లులో మహిళా సంబరం: చారిత్రక నగరిలో ఈసారి రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవం!!

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి రాష్ట్రస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను చారిత్రక నగరమైన ఓరుగల్లు కేంద్రంగా నిర్వహించనున్నట్టు సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి రాష్ట్రస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను చారిత్రక నగరమైన వరంగల్ ముస్తాబవుతుంది. ఓరుగల్లు కేంద్రంగా రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవం నిర్వహించనునట్టు రాష్ట్ర శిశు, సంక్షేమ, గిరిజనాభివృద్ధి శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. రాణి రుద్రమ నడయాడిన గడ్డమీద రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించనుండటం గర్వకారణం అన్నారు.

ఓరుగల్లులో రాష్ట్ర స్థాయిలో జరిగే మహిళా దినోత్సవ వేడుకలు

ఓరుగల్లులో రాష్ట్ర స్థాయిలో జరిగే మహిళా దినోత్సవ వేడుకలు


హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రక ఓరుగల్లులోని హనుమకొండలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ వెల్లడించారు. వరంగల్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని పేర్కొన్న ఆమె, నేడు హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో వరంగల్, హనుమకొండ రెండు జిల్లాల కలెక్టర్లు అధికారులతో ఈ మేరకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

పక్క ప్రణాళిక ప్రకారం మహిళా దినోత్సవ వేడుకలు: మంత్రి సత్యవతి రాథోడ్

పక్క ప్రణాళిక ప్రకారం మహిళా దినోత్సవ వేడుకలు: మంత్రి సత్యవతి రాథోడ్


అన్ని రంగాలలో ప్రతిభ చూపిస్తున్న మహిళలకు కమిటీ సూచించిన ప్రకారం పారదర్శకంగా అవార్డులు ఇవ్వనున్నామని, మిగతా రాష్ట్రాలలో ఈ అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటారని, కానీ మన దగ్గర వారి ప్రతిభను ప్రభుత్వమే గుర్తించి, లక్ష రూపాయల నగదు, శాలువా, మొమెంటోలతో సత్కరిస్తున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఇన్విటేషన్లు పంపాలని, పక్క ప్రణాళిక ప్రకారం మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించాలని సూచించారు.

ఓరుగల్లు ఘనత చాటేలా ఉత్సవాలు

ఓరుగల్లు ఘనత చాటేలా ఉత్సవాలు


రాష్ట్రం నలుమూలల నుండి ఎంతోమంది మహిళామణులు, అవార్డు గ్రహీతలు వస్తారని, వారికి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్ చరిత్ర తెలిసే విధంగా వారికి అందించే బహుమానాలు ఉండాలని పేర్కొన్నారు. ఇక అదే రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి, కావలసిన మొక్కలను కూడా అందుబాటులో ఉంచాలని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులుగా హరీష్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని పేర్కొన్న మంత్రి సత్యవతి రాథోడ్ వరంగల్ జిల్లాలో మహిళా దినోత్సవం రోజు మహిళా క్లినిక్ లను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

కాకతీయ యూనివర్సిటీలో వేడుకల ఏర్పాట్లు: భారతి హోళికేరి

కాకతీయ యూనివర్సిటీలో వేడుకల ఏర్పాట్లు: భారతి హోళికేరి

కాగా హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలుఈసారి హనుమకొండ లో చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్న స్పెషల్ సెక్రటరీ భారతి హోళికేరి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే అతిధులకు ఏర్పాట్ల విషయంలో, పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని పేర్కొన్నారు.

ఓరుగల్లులో మహిళా సంబరం .. జోష్

ఓరుగల్లులో మహిళా సంబరం .. జోష్

ప్రతి ఒక్క అంశంలో పక్కాగా ఏర్పాట్లు జరగాలని, కార్యక్రమం మొదలైనప్పటి నుండి చివరి వరకు ప్రతి ఈవెంట్ పక్కా ప్రణాళికతో జరగాలని సూచించారు. నోడల్ అధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలని భారతి హోళికేరి తెలిపారు. ఓరుగల్లులో ఈ ఏడాది రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు జరగటం ఓరుగల్లు వాసులలో కూడా జోష్ నింపుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+