Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పురుషులతో పోటీగా లిక్కర్ కోసం మహిళల క్యూ ... హైదరాబాద్ లోనూ బెంగళూరు సీన్

తెలంగాణా రాష్ట్రంలో నేటి నుండి లిక్కర్ అమ్మకాలు మొదలయ్యాయి . తెలంగాణా సర్కార్ లిక్కర్ సేల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మద్యం ప్రియులు వైన్స్ ముందు బారులు తీరుతున్నారు . కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. ఇక పురుషులకు పోటీగా మహిళలు కూడా మద్యం కోసం క్యూ లైన్లలో పోటీ పడుతున్నారు. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో మహిళలు, అమ్మాయిలు మద్యం కోసం వైన్స్ ముందు నిల్చున్న తీరు బెంగళూరులో ఇటీవల మహిళలు మద్యం కోసం క్యూ కట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది.

Recommended Video

    Women In Queue For Liquor In Hyderabad | Oneindia Telugu
    వైన్స్ ముందు మహిళలు, అమ్మాయిలు క్యూ .. తెలంగాణాలోనూ మండుభామలు

    వైన్స్ ముందు మహిళలు, అమ్మాయిలు క్యూ .. తెలంగాణాలోనూ మండుభామలు

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ౩.o కొనసాగుతున్నా సరే మద్యం అమ్మకాలకు సడలింపు ఇచ్చింది కేంద్ర సర్కార్ . దీంతో చాలా రాష్ట్రాల్లో రెండో రోజుల క్రితమే వైన్స్‌లు ఓపెన్ అయ్యాయి.. బెంగళూరు సహా కొన్ని మెట్రో సిటీల్లో మహిళలు, అమ్మాయిలు కూడా వైన్స్‌ల ముందు క్యూలైన్లలో దర్శనం ఇచ్చారు . ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా లిక్కర్ కోసం పురుషులతో పోటీ పడ్డారు. తెలంగాణాలోనూ లిక్కర్ కోసం మందు భామలు మేము సైతం అన్నారు .ఒకప్పుడు పురుషులు మద్యం తాగితేనే అదేదో తప్పు అన్నట్టు చూసిన రోజుల నుండి ఇప్పుడు ఆడామగా తేడా లేకుండా లిక్కర్ తాగటం ఒకింత షాకింగ్ అనిపించినా ఇది ప్రస్తుత పరిస్థితి అని చెప్పక తప్పదు .

    మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు .. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ లిక్కర్ కోసం పడిగాపులు

    మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు .. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ లిక్కర్ కోసం పడిగాపులు

    లిక్కర్ కోసం వైన్స్ దగ్గరకు వచ్చిన మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో కూడా నేడు వైన్స్ ఓపెన్ కావటంతో వైన్స్ తెరవక ముందు నుండే మద్యం భామలు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా మెట్రో నగరమైన హైదరాబాద్‌లో చాలా చోట్ల ఈ దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. వైన్స్‌ల ఎదుట మహిళలు, అమ్మాయిలు క్యూలైన్లలో సామాజిక దూరం పాటిస్తూ , ముఖాలకు మాస్కులు కట్టుకుని నిలబడ్డారు. తెల్లారకముందే వైన్స్‌ల వద్ద మందు బాబులు భారీ సంఖ్యలో క్యూలైన్లలో నిలబడగా మేము మీకు ఏ మాత్రం తీసిపోము అన్న చందంగా మహిళలు పోటీ పడుతున్నారు.

     హైదరాబాద్ మెట్రో నగరంలో చాలా చోట్ల మహిళల క్యూ లైన్లు .. మద్యం కొనుగోళ్ళు

    హైదరాబాద్ మెట్రో నగరంలో చాలా చోట్ల మహిళల క్యూ లైన్లు .. మద్యం కొనుగోళ్ళు

    ఉదాహరణకు చూస్తే కొండాపూర్‌లోని ఓ వైన్స్‌ ముందు మందుబాబులకు పోటీగా అమ్మాయిలు కూడా ఉదయాన్నే వచ్చి లైన్‌లో నిల్చున్నారు. ఇక కొండాపూర్ మాత్రమే కాదు పంజాగుట్ట, మాదాపూర్‌ లలో వైన్‌ షాపుల ముందు మహిళలు క్యూ నిల్చున్న దృశ్యాలు కనిపించాయి . ఇక అంతేకాదు ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్ సిటీలోనూ ఐటీ సెక్టార్‌లోని పలు మద్యం షాప్‌ల దగ్గర క్యూకట్టి మరీ మహిళలు మద్యం కొనుగోలు చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల వృద్ధులైన మహిళలు మద్యం కోసం వైన్‌ షాపుల వద్దకు వచ్చారు. సామాజిక దూరం పాటిస్తూనే ముఖాలకు మాస్కులతో అమ్మాయిలు లిక్కర్ కోసం పడిగాపులు కాశారు. ఇక కోఠిలోని బగ్గా వైన్స్ దగ్గర కొందరు మహిళలు క్యూలైన్లలో నిల్చుని లిక్కర్ కొనుగోలు చేశారు .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+