Women's day 2025: గ్రామీణ మహిళల స్ఫూర్తిదాయక ప్రస్థానం..ములుకనూరు మహిళా సహకార డెయిరీ!
ఆకాశంలో సగం ,అవనిలో సగం అతివ అంటారు. అటువంటి అతివలకు ఏ రంగంలోనైనా అవకాశం ఇస్తే తమని తాము నిరూపించుకొని విజయతీరాలకు చేరతారని చెప్పేందుకు సాక్ష్యంగా నిలిచారు మల్కనూరు మహిళా సహకార డెయిరీ నిర్వహిస్తున్న గ్రామీణ మహిళలు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మహిళలు కష్టాలకే సవాల్ విసిరారు.. కరువు కాటకాలతో ముల్కనూరు ప్రాంతం విలవిలలాడుతున్న సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు నడిచారు.
గ్రామీణ మహిళలు నిర్వహిస్తున్న డెయిరీ
ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 68 గ్రామాలలో 8426 మంది సభ్యులు ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ముల్కనూరులో ఆగస్టు 17 2002లో ముల్కనూరు మహిళా సహకార డెయిరీ ని ప్రారంభించారు. గొప్ప గొప్ప చదువులు చదివిన వారు కాకపోయినా, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇందులో లేకపోయినా, కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి నిదర్శనంగా మహిళలు ఈ డెయిరీలోని అన్ని విభాగాలలోని పనులను అలవోకగా చేసేస్తారు.

పురుషులకు ధీటుగా డెయిరీ నిర్వహణ
నాణ్యతలో రాజీలేకుండా పని చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ముల్కనూరు పాలు పాల పదార్థాలు అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా దీనిని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ముల్కనూరు సహకార డెయిరీలో 130 మంది మహిళలు పర్మినెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరంతా పాలను సేకరించి, పాశ్చరైజ్ చేసే దగ్గర నుండి, పాల పదార్థాలను తయారు చేయడం, వాటిని ప్యాకింగ్ చేయడం, మార్కెటింగ్ విధులలో పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా పనిచేస్తారు.
డెయిరీ ఎదిగినట్టే మహిళల జీవితాలలో ఎదుగుదల
ముల్కనూరు మహిళా సహకార డెయిరీ ప్రగతికి దోహదం చేయడమే కాకుండా ఇక్కడ పని చేస్తున్న మహిళలు వారి జీవితాలను సైతం దిద్దుకుంటున్నారు. డెయిరీ ఎలా ఎదిగిందో తమ జీవితాలలో కూడా అలాంటి ఎదుగుదలే ఉందని వారు చెప్తున్నారు. ఈ డెయిరీ యూనియన్ సంఘ సభ్యుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

లాభాల నుండి సభ్యులకు బోనస్ లు
ఇప్పటివరకు 5,000 మందికి పైగా దేశ విదేశీ ప్రముఖులు ఈ డెయిరీని సందర్శించి ఇక్కడ మహిళలు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ మహిళా డెయిరీలో ప్రతి సంవత్సరం వచ్చిన లాభాలను సంఘ సభ్యులకు బోనస్ ల రూపంలో అందిస్తారు. ప్రతి సంవత్సరం జూలై మాసంలో మహాసభ నిర్వహించి ఎక్కువ స్థాయిలో పాలను అందించిన పాల సంఘాలకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తారు.
203 గ్రామాలలో 25 వేల మంది మహిళల కుటుంబాలలో వెలుగు
ఈ డెయిరీ వలన 203 గ్రామాలలో 25 వేల మంది మహిళల కుటుంబాలు బాగుపడ్డాయి. పిల్లలను ఉన్నత చదువులు చదివించి గొప్పగా తీర్చిదిద్దడానికి వీరికి ముల్కనూరు డెయిరీ కల్పవల్లి అయింది. ఇక్కడ పని చేసే ప్రతి మహిళది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. కష్టాలను అధిగమించి విజయతీరాలకు సాగుతున్న స్ఫూర్తిదాయకమైన కథ. మొక్కవోని ధైర్యంతో ముందుకు నడిచిన వీరంతా సాధించిన విజయం ఎంతోమంది ప్రశంసలు పొందింది.

డెయిరీ నిర్వహణలో ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ ది కీలక పాత్ర
ప్రస్తుతం ముల్కనూర్ మహిళా సహకార డెయిరీకి ప్రెసిడెంట్ గా రైతు కుటుంబం నుండి, పశు పోషణ చేసిన స్థాయి నుండి ఎదిగి వచ్చిన ధన శ్రీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సహకార మహిళా డెయిరీ సంఘాన్ని ఏకతాటి మీద ముందుకు నడిపిస్తున్నారు. ములకనూరు మహిళా కో ఆపరేటివ్ డెయిరీకి జనరల్ మేనేజర్ గా భాస్కర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పడు వారికి కావాల్సిన సలహాలు, సూచనలు చేస్తూ డెయిరీని ముందుకు నడిపిస్తున్నారు.

సాధించిన అవార్డులు.. దేశానికే రోల్ మోడల్
ఇక ఈ మహిళలు సాధించిన అవార్డుల విషయానికి వస్తే 2006లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం హోదాలో ముల్కనూరుకు వచ్చి ఇక్కడి మహిళలకు కితాబిచ్చారు. 2012లో రాష్ట్రపతి చేతుల మీదుగా కో-ఆపరేటివ్ ఎక్సలెన్స్ అవార్డును, 2017లో ఎన్డిడీబీ డెయిరీ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. నీళ్లు లేని చోట క్షీర విప్లవాన్ని సాధించి, కవ్వమాడిన చోట కరువు ఉండదని నిరూపించి దేశానికే రోల్ మోడల్ గా మహిళా జాతికే స్ఫూర్తిగా నిలిచింది ముల్కనూరు మహిళా సహకార డెయిరీ. దేశంలోనే నంబర్ 1 మహిళా డెయిరీగా గుర్తింపు పొందింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications