Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Women's day 2025: She Care శానిటరీ న్యాప్‌కిన్‌ ఇండస్ట్రీ నిర్వహిస్తున్న గ్రామీణ మహిళలు!

శక్తి స్వరూపిణి మహిళ ఆమె తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అన్ని రంగాలలోనూ విశేషంగా కృషి చేస్తున్న మహిళ నేడు దేశ ఆర్థిక అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తుంది. పెద్దగా చదువుకోని గ్రామీణ ప్రాంతాలలోనూ మహిళా సాధికారత పైన పెరిగిన అవగాహన అంతా ఇంతా కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లాలోని మహిళల స్ఫూర్తిదాయక కథనం వన్ ఇండియా ప్రత్యేకం .

శానిటరీ న్యాప్కిన్ యూనిట్ మొదలుపెట్టిన గ్రామీణ మహిళలు
గీసుకొండ మండలం కోనాయిమాకుల గ్రామంలోని మహిళా సంఘాలు ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ నుండి ప్రేరణ పొందిన స్థానిక మహిళలు శానిటరీ న్యాప్కిన్ లను తయారు చేసే ఇండస్ట్రీని ప్రారంభించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఆరు లక్షల రూపాయలు వారే స్వయంగా పెట్టుబడి పెట్టి మొత్తం 16 లక్షలతో శానిటరీ నాప్కిన్స్ యూనిట్ ను మొదలుపెట్టారు.

Women s Day 2025 Women running the sanitary napkin industry in warangal district with determination

సంవత్సరంన్నర బ్యాంకు లోన్ కోసం తిరిగిన మహిళలు
ముగ్గురు మహిళలు ఎన్ .సుభాషిని, జి కోమలత, కే రమాదేవి ప్రారంభించిన ఈ ప్రయాణం ఎంతోమందికి ఆదర్శంగాను, స్ఫూర్తిదాయకంగానూ నిలుస్తుంది. దాదాపు సంవత్సరమున్నర పాటు పట్టు వదలని విక్రమార్కుల్లాగా బ్యాంకు రుణం కోసం తిరిగి, చివరకు అనుకున్న విధంగానే రుణం సాధించి శానిటరీ నాప్కిన్స్ తయారీ ఇండస్ట్రీని ప్రారంభించారు. బ్యాంకు నుండి పొందిన ఋణంతో పాటు తాము నిధులను సమకూర్చుకున్నారు.

తయారీ, మార్కెటింగ్ అంతా వీరే
శానిటరీ నాప్కిన్ల తయారీకి కావలసిన యంత్రాన్ని, ముడి పదార్థాలను కొనుగోలు చేశారు. షి కేర్ అని వారి ఉత్పత్తికి నామకరణం చేశారు. శానిటరీ నాప్కిన్స్ తయారు చేయడం మాత్రమే కాకుండా వాటిని మార్కెటింగ్ కూడా వారే చేస్తున్నారు. గ్రామ సంఘాలకు, మహిళా సంఘాలకు వీటిని నేరుగా వెళ్లి విక్రయించి వస్తున్నారు. అలాగే ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో విద్యార్థినులకు వీటిని విక్రయిస్తున్నారు.

Women s Day 2025 Women running the sanitary napkin industry in warangal district with determination

గ్రామాలలో న్యాప్కిన్స్ పై అవగాహన కల్పిస్తూ విక్రయం
తాము తయారు చేసిన ఈ బ్రాండ్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రముఖ బ్రాండ్లకు ఏమాత్రం తీసిపోదని, లుసిడ్ తమ బ్రాండ్ బాగుందని అనుమతి ఇచ్చాకే మార్కెట్ లోకి వెళ్తున్నామని చెబుతున్నారు. సెర్ప్ స్త్రీశక్తి శానిటరీ నాప్కిన్స్ జాయింట్ లయబిలిటీ గ్రూప్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకొని, షీ కేర్ బ్రాండ్ తో మార్కెట్లోకి వెళుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంకా న్యాప్కిన్స్ వాడకం తెలీని వారికి అవగాహన కల్పిస్తూ న్యాప్కిన్స్ విక్రయిస్తున్నారు.

బ్యాంక్ లోన్ తీరిపోతే లాభాలు వస్తాయని ఆశ
ఇప్పటివరకు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం సగం తీర్చగలిగామని త్వరలోనే మొత్తం రుణం తీరుస్తాం అంటున్నారు. ఆ తర్వాత తాము లాభాలను కళ్ళజూస్తామని ఈ ముగ్గురు మహిళలు చాలా సంతోషంగా చెబుతున్నారు. ఇప్పటివరకు తమ ఖర్చులకు, బ్యాంకు నుండి తీసుకున్న రుణం చెల్లించడానికి సరిపడా సంపాదిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రతి నెల 1,50,000 రూపాయలు దాకా ఆదాయం వస్తుందని వారు అంటున్నారు.

Women s Day 2025 Women running the sanitary napkin industry in warangal district with determination

వీరితో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచన
శానిటరీ నాప్కిన్స్ ఇండస్ట్రీ పెట్టిన తర్వాత తమ జీవితాలలో మార్పు వచ్చిందని, ఆత్మవిశ్వాసం పెరిగిందని చెబుతున్న ఈ మహిళలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. పెద్దగా చదువుకోకపోయినా ఇండస్ట్రీని స్థాపించి ముందుకు నడవాలన్న వీరి పట్టుదల ప్రతి ఒక్కరికి ఆదర్శం. ప్రస్తుతం ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరిని చేర్చుకొని శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తున్నారు . భవిష్యత్తులో మరో 10మందికి దీని ద్వారా ఉపాధి కల్పించాలని వీరు కలలు కంటున్నారు.

కష్టించి పని చేసే మహిళలకు ప్రభుత్వాల సహకారం
వీరు చేస్తున్న ప్రయత్నానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సంపూర్ణంగా మద్దతు వస్తోంది. కేంద్రం ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ కార్యక్రమం కింద రుణమిచ్చి ప్రోత్సహిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చోటా వీరి స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ వీరి ఉత్పత్తుల మార్కెటింగ్ కు సహాయపడుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయబోయే మహిళా సంఘాల స్టాల్స్ లో వీరు తయారు చేస్తున్న శానిటరీ నాప్కిన్ స్టాల్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినట్టు వీరు సంతోషంగా చెబుతున్నారు. మహిళల ఆలోచనలకు తగ్గట్టుగా సహకరించే వ్యవస్థ ఉంటే కచ్చితంగా విజయతీరాలకు చేరవచ్చని ఈ ముగ్గురు మహిళలు నిరూపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+