బాగ్ మంత్రి బాగ్! కేంద్రమంత్రి మీనాక్షి లేఖిపై మంత్రి కేటీఆర్ సెటైర్లు

హైదరాబాద్: రెజ్లర్ల నిరసనలపై స్పందించాలంటూ మీడియా ప్రశ్నించడంతో అక్కడ్నుంచి పరుగు పెట్టిన కేంద్రమంత్రి మీనాక్షి లేఖిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా వీడియో పోస్టు చేసి సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుండగా.. తాజాగా కేటీఆర్ కూడా తనదైన శైలిలో స్పందించారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలంటూ ప్రముఖ రెజ్లర్లు ఢిల్లీలో నెలరోజులుగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన పార్లమెంటుకు మార్చ్ నిర్వహించగా.. రెజ్లర్లను అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విడిచిపెట్టారు. అయితే, నిరసనను తీవ్రతరం చేస్తూ తమ పతకాలను కూడా గంగా నదిలో పడేస్తామని మంగళవారం హరిద్వార్‌కు కూడా వెళ్లారు. రైతు నేతలు వారిని వారించడంతో ఆగిపోయారు. కేంద్రానికి ఐదు రోజుల డెడ్‌లైన్ విధించారు.

 wrestlers issue

ఈ నేపథ్యంలో గురువారం కేంద్రమంత్రి మీనాక్షి లేఖి మీడియా కంటపడ్డారు. రెజ్లర్ల సమస్యలపై స్పందించాల్సిందిగా మీడియా ఆమెను ప్రశ్నించడంతో.. అక్కడ్నుంచి తప్పించుకుని పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చలో చలో అంటూ మంత్రి మీనాక్షి లేఖి తన కారువైపు పరుగులు పెట్టారు. సదరు మీడియా ప్రతినిధి కూడా ఆమె వెంటే పరుగులు తీస్తుంటే ఆ సమస్యను చట్టం చూసుకుంటుందని చెబుతూ తప్పించుకున్నారు.

ఇక ఈ ఘటనపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. 'నేను భాగ్.. మిల్కా భాగ్ గురించి విన్నాను.. ఈ భాగ్ మంత్రి భాగ్ ఏంటి?' అంటూ పోస్టు పెట్టారు. మీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ప్రెస్‌ని.. పబ్లిక్‌ని ఎదుర్కొనలేరు అనే క్యాప్షన్‌తో కేటీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు, రెజ్లర్ల అంశంలో బ్రిజ్ భూషణ్ తనను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. ఏం జరుగుతుందో చూద్దాం? నా పదవీ కాలం ముగిసింది.. నేను దోషిగా తేలితే నన్ను అరెస్ట్ చేస్తారు.. దీంతో సమస్య ఏంటని ప్రశ్నించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తప్పు చేశానని రుజువు చేస్తే తాను ఉరివేసుకుంటానని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+