యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు తేదీలు ఖరారు

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. యాదగిరిగుట్ట ఆలయంలో మార్చి 1 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మార్చి 7న ఎదుర్కోలు మహోత్సవం, 8న తిరు కళ్యాణోత్యవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మార్చి 9న దివ్య విమాన రథోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆలయంలో కళ్యాణాలు, హోమాలు, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చణ సేవలను రద్దు చేసినట్లు యాదగిరిగుట్ట ఆలయ అధికారులు తెలిపారు. కాగా, యాదగిరిగుట్టలో పంచనారసింహస్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఈ ఏడాదితో 70 సంవత్సరాలు పూర్తవుతాయి.

Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam from March 1

ఇక, కృష్ణశిలతో పునర్ నిర్మితమైన ఆలయంలో మూడోసారి జరగనున్నాయి ఈ వేడుకలు. తాజాగా, 50.5 అడుగుల ఎత్తు, ఐదంతస్తుల కృష్ణశిల విమాన గోపురం బంగారు కవచాలతో రూపొంది మహా దివ్యంగా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1న ప్రారంభమై 11న సహస్ర ఘటాభిషేకంతో ముగుస్తాయి.

కాగా, యాదాద్రిలో నరసింహస్వామివారు ఉగ్ర, జాల్వా, యోగ, గండబేరుండ, శ్రీలక్ష్మీ సమేత నారసింహుడిగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. ఉగ్ర ఆకృతిలో వ్యాఘ్ర రూపంలో భయాన్ని తొలగిస్తారు. బాధల నుంచి విముక్తి కలిగించే దయామయుడిగా అఖండ జ్యోతి స్వరూపంలో అభయమిస్తారు.

నమ్మికొలిచినవారికి కొంగుబంగారమై గండబేరుండ రూపంలో దర్శనమిస్తారు. యోగ ముద్రలో భక్తులకు మానసిక ప్రశాంతత కలిగిస్తూ యోగానంద నారసింహుడిగా పూజలందుకుంటారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగినట్లుగా ప్రభుత్వం, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+