• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భక్తల్ పరారీ ప్లాన్?: చెర్లపల్లి జైలు వద్ద ఆక్టోపస్ భద్రత

By Pratap
|

హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహ వ్యవస్థాపకుడు, దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు యాసి న్ భత్కల్‌ను జైలు నుంచి తప్పించేందుకు పథకం వేసినట్లు అనుమానిస్తున్నారు. అతన్ని తప్పించేందుకు ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గుర్తించిందని శనివారంనాడు వార్తలు వచ్చాయి.

అతను ప్రస్తుతం చర్లపెల్లి జైలులో ఉన్నాడు. ఐబి హెచ్చరికలతో ఒక ప్లాటూన్ (30 మంది) ఆక్టోపస్ బలగాలతో జైలు వద్ద శుక్రవారం రాత్రి నుంచి భద్రతను కట్టుదిట్టం చేశారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన యాసిన్ భత్కల్‌తోపాటు చర్లపల్లి జైలులో 13 మంది ఉగ్రవాదులున్నారు. వీరందర్నీ హై సెక్యూరిటీ జోన్‌లో భారీ భద్రత మధ్య ప్రత్యేక బ్యారక్‌లో ఉం చారు.

జైలు నుంచి తప్పించుకోబోతున్నట్లు జైల్లోని ఫోన్ ద్వారానే తన కుటుంబసభ్యులకు భత్కల్ చెప్పినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మధ్య కాలంలో అతడు చేసిన 27 ఫోన్స్ కాల్స్ రికార్డ్‌ను అధికారులు పరిశీలించారు. భత్కల్‌ను తప్పించేందుకు స్లీపర్ సెల్స్ ప్రణాళికలు వేస్తున్నట్లు గుర్తించారు. గత 15 రోజుల్లో మూడుసార్లు రంగారెడ్డి కోర్టు లో ఉన్న ఎన్‌ఐఏ కోర్టులో హాజరు పరిచిన సమయంలో భత్కల్ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.

 Yasin Bhatkal

ఒకసారి భద్రత పేరుతో ఒక పేపర్‌ను కోర్టు ఆవరణలో విడిచిపెట్టాడు. రెండోసారి రోజా పూవును చూపించి కోర్టు ఆవరణలో పోలీసులను పరుగులు పెట్టించాడు. మూడోసారి ఒక నోట్‌బుక్‌ను చూపిస్తూ హల్‌చల్ చేశాడు. తనకు భద్రత లేదుంటా చర్లపల్లి జైలు అధికారులపై కూడా ఫిర్యాదు చేశాడు.

యాసిన్ భత్కల్ ఉంటున్న బ్యారక్ వద్ద సీసీ కెమెరాలు, సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ కూడా దాఖ లు చేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అకస్మాత్తుగా ఆక్టోపస్ బలగాలు రంగంలోకి దిగడంతో యాసిన్ భత్కల్ పారిపోయేందుకు చేస్తున్న కుట్ర వాస్తవమేనన్న అనుమానాలు వ్యక్తమతున్నాయి.

ఈ విషయంపై చర్లపల్లి జైలు సూపరింటెంటెండ్ వెంకటేశ్వర్‌రెడ్డిని సంప్రదించగా నిఘా వర్గాల నుంచి ఏదైనా సమాచారం ఉండి ఉంటుందని, అందువల్లే ఆక్టోపస్ బలగాలు వచ్చి ఉంటాయని తెలిపినట్లు వార్తలు వచ్చాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to media reports - In a measure to strengthen the security at Cherlapally Central Prison, a platoon of Octopus commandos will be soon deployed there. Sources say the move comes in the wake of rumours that terrorist Yasin Bhatkal is planning to escape from the prison. A 30-member Octopus platoon will monitor security there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more