year ender 2023: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో సంతోషాల, వేడుకల ఏడాది!!

2023 సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో సంతోషాలను తీసుకువచ్చింది. ఎంతోకాలంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నిరీక్షణకు ఈ ఏడాది ఫలితం దక్కింది . ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి ఇల్లు సంతోషాలకు, వేడుకలకు ఆలవాలమైంది. అందుకు కారణం లేకపోలేదు. మెగా కుటుంబంలో సంతోషాలకు స్వాగతం పలుకుతూ చిన్నారి క్లీంకార ఈ ఏడాది పుట్టింది.

ఎంతోకాలంగా రామ్ చరణ్ తేజ్ ఉపాసన దంపతులకు పిల్లలు లేక తీవ్ర మనోవేదనకు గురైన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆ మనోవేదనకు ఎండ్ కార్డ్ పడింది. మెగా ఫ్యామిలీ లో ఎన్నో ఏళ్ళు తపస్సు ఫలించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దీంతో మెగా కుటుంబంలో సంతోషం వెల్లి విరిసింది.

year ender 2023: This year happiness and celebration in Megastar Chiranjeevi family!!

రామ్ చరణ్ తేజ్ ఉపాసన దంపతులకు పిల్లలు లేకపోవడంతో అంతకుముందు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు ఉపాసన. అయితే ఆ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పిన ఉపాసన అది తన వ్యక్తిగత జీవితమని, తాము ఏం చేయాలో తమకు తెలుసని అనేకమార్లు మీడియా ముఖంగా చెప్పారు. ఇక ఫైనల్ గా 2023 ఉపాసనకు సంతోషం ఇచ్చిన సంవత్సరంగా మిగిలింది.

ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గరనుండి, మెగా ఫ్యామిలీలో సంతోషానికి అవధులు లేవు. జూన్ 20వ తేదీన తెల్లవారుజామున 01:49 కు మెగా ఫ్యామిలీ లోకి క్లీంకార ఆగమనం చిరంజీవి కుటుంబానికి పండుగ రోజు. తమకు మనవరాలు పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన ఆనందాన్ని అందరికీ తెలియజేశారు. భావోద్వేగానికి లోనయ్యారు.

ఎన్నో ఏళ్ళుగా వేచి చూసిన ఆనంద క్షణాలు ఇవని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. వెల్కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్ అంటూ తన మనవరాలిని స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవి నీ రాకతో మెగా ఫ్యామిలీ లో ఆనందాన్ని తీసుకువచ్చావు అంటూ పేర్కొన్నారు. నీ రాకతో అంతా సంతోషంగా ఉన్నామని తెలియజేశారు. కోట్లాది మంది ఆశీర్వదించిన రామ్ చరణ్ ఉపాసనల కూతురిగా, మమ్మల్ని తాతా నానమ్మలను చేశావు అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

ఆ తర్వాత క్లీంకార నామకరణ వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఇక అప్పటినుంచి మెగాస్టార్ చిరంజీవి ఇంట ఎటువంటి పండుగలు అయినా క్లీంకార స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ రాం చరణ్ తండ్రిగా కూతురితో తన్మయత్వాన్ని పొందారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు , మెగాస్టార్ చిరంజీవి దంపతులకు ఈ సంవత్సరం అందమైన బహుమతిగా, మర్చిపోలేని సంవత్సరంగా మిగిలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+