యశోదా ఆస్పత్రిలో యంగ్ డాక్టర్స్ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: గడిచిన ఐదేళ్లలో 9వ తరగతి ఉత్తీర్ణులైన పాఠశాల విద్యార్థులకు వైద్య వృత్తిపై ఆసక్తి పెంచే క్రమంలో యంగ్ డాక్టర్స్ క్యాంప్ ప్రారంభించింది యశోదా ఆస్పత్రుల యాజమాన్యం. ఏటా మే 11 నుంచి 14వ తేదీ వరకు ఈ యంగ్ డాక్టర్స్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది.
ఈసారి నిర్వహించిన ఈ క్యాంప్‌నకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు నుంచి సుమారు రెండు వేల మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ మేరకు వివరాలను ఆస్పత్రి వర్గాలు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించాయి.
క్యాంప్‌లో పాల్గొన్న వారిలో 105 మందిని ఎంపిక చేసి, మూడు బ్యాచ్‌లుగా విభజించినట్లు వారు వివరించారు. అనంతరం విద్యార్థులను పూర్తిస్థాయి డాక్టర్ల మాదిరిగానే ఆప్రాన్ ధరించి, మెడలో స్టెథస్కోప్ వేసి సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్‌పేట శాఖల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.
ఒంటిపై ఆప్రాన్, మెడలో స్టెథస్కోప్ ధరించి ఉంటే తమ పిల్లలు అప్పుడే డాక్టర్లు అయిపోయినంత ఆనందం కలిగిందని, కలను నిజం చేసేందుకు కృషి చేస్తామని పలువురు తల్లిదండ్రులు తెలిపారు. వైద్యశాల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, పలువురు యంగ్ డాక్టర్స్ వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

యంగ్ డాక్టర్స్ సందడి
గడిచిన ఐదేళ్లలో 9వ తరగతి ఉత్తీర్ణులైన పాఠశాల విద్యార్థులకు వైద్య వృత్తిపై ఆసక్తి పెంచే క్రమంలో యంగ్ డాక్టర్స్ క్యాంప్ ప్రారంభించింది యశోదా ఆస్పత్రుల యాజమాన్యం.

యంగ్ డాక్టర్స్ సందడి
ఏటా మే 11 నుంచి 14వ తేదీ వరకు ఈ యంగ్ డాక్టర్స్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది.

యంగ్ డాక్టర్స్ సందడి
ఈసారి నిర్వహించిన ఈ క్యాంప్‌నకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు నుంచి సుమారు రెండు వేల మంది విద్యార్థులు తరలివచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించాయి.

యంగ్ డాక్టర్స్ సందడి
క్యాంప్‌లో పాల్గొన్న వారిలో 105 మందిని ఎంపిక చేసి, మూడు బ్యాచ్‌లుగా విభజించినట్లు వారు వివరించారు.

యంగ్ డాక్టర్స్ సందడి
అనంతరం విద్యార్థులను పూర్తిస్థాయి డాక్టర్ల మాదిరిగానే ఆప్రాన్ ధరించి, మెడలో స్టెథస్కోప్ వేసి సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్‌పేట శాఖల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.

యంగ్ డాక్టర్స్ సందడి
రోగులను ఎలా పరిక్షిస్తారు, వైద్య పరీక్షలు ఎలా చేస్తారు.. తదితర అంశాలతోపాటు ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, డయాగ్నస్టిక్ తదితర విభాగాలను చూపించి, వివరించారు.

యంగ్ డాక్టర్స్ సందడి
క్యాంప్ జరిగిన నాలుగు రోజుల సమయంలో తాము నిజంగానే డాక్టర్స్ అయిపోయామనే భావన కలిగిందని విద్యార్థులు మురిసిపోయారు.

యంగ్ డాక్టర్స్ సందడి
ఈ క్యాంప్ వల్ల తమకు డాక్టర్ కావాలనే కోరిక బలపడిందని, ఆసక్తి పెరగడంతో చదువుపై శ్రద్ధ పెడతామని విద్యార్థులు వివరించారు.
-
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications