ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిన లవర్.. లైఫ్ నుంచే లాగ్ అవుట్ !

ఎంతో విలువైన జీవితాన్ని.. క్షణికావేశంలో కొందరు మాత్రం కాలరాసుకుంటున్నారు. ప్రేమించిన యువతి దూరం పెట్టడాన్ని తట్టుకోలేక ఓ యువకుడు తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

ఐదేళ్ల ప్రేమ.. ఒక్కసారిగా బ్లాక్..

సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన ఏపూరి ప్రవీణ్ (28) అనే యువకుడు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన ఓ యువతిని గత ఐదు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. వారి కుటుంబాల మధ్య పెళ్లిపై కూడా చర్చలు జరిగినట్టు సమాచారం.

young-man-committed-suicide-due-to-his-lover-blocked-phone-number

అయితే ఇటీవల అనూహ్యంగా యువతి ప్రవర్తన మారిందని.. మాట్లాడటం తగ్గించి, చివరకు అతని ఫోన్ నంబర్‌ను పూర్తిగా బ్లాక్ చేసిందని తెలుస్తోంది. అంతే కాకుండా ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడుతుందన్న విషయం తెలిసి ప్రవీణ్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.

ఈ క్రమంలోనే బాధను భరించలేక.. తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం రాత్రి ప్రవీణ్ మృతి చెందాడు.

కాగా చనిపోవడానికి ముందు.. "అమ్మా నాన్నా.. నేను నిజంగా ప్రేమించాను, ఆమె నన్ను మోసం చేసింది అంటూ కుటుంబసభ్యులతోవాపోయినట్టు సమాచారం. ప్రవీణ్ మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోతె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ సంఘటనతో బోడబండ్లగూడెంలో విషాదం అలముకుంది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకునే ముందు కన్నవారి కోసం బ్రతకాలి అని గుర్తు చేసుకోవాలని పలువురు ఉపదేశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+