ప్రేమ పెళ్లికి అడ్డొస్తున్నాడని.. ప్రియురాలి తండ్రిపై కాల్పులు జరిపాడు

హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహానికి అడ్డు వస్తున్నాడని తన ప్రియురాలి తండ్రిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేటకు చెందిన బల్వీందర్ సింగ్ (25), సరూర్‌నగర్ పరిధిలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన ఓ యువతి (23) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయంలో ఇంట్లో తెలియడంతో యువతిని ఆమె తండ్రి ఇటీవలే అమెరికా పంపించారు.

Young man shot at the girlfriend s father because he was obstructing the love marriage

ఈ క్రమంలో ఆదివారం యువతి ఇంటికి వచ్చిన బల్వీందర్ సింగ్ యువతి తండ్రి రేవంత్ ఆనంద్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు బల్వీందర్ సింగ్ తన వెంట తెచ్చుకున్న ఎయిర్ గన్‌తో రేవంత్ ఆనంద్‌పై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే, తూటా కంట్లో నుంచి దూసుకెళ్లడంతో రేవంత్ ఆనంద్‌కు తీవ్ర గాయమైంది.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన రేవంత్ ఆనంద్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సిద్దిపేటలో విషాదం

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన పిల్లలతో కలిసి చెరువులు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానందనగర్ కాలనీకి చెందిన సత్యం (49) ప్రింటింగ్ ప్రెస్ నడుపుతుండేవాడు. పదేళ్ల క్రితం తన భార్య చనిపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకి ఇద్దరు పిల్లలు కుమార్తె త్రివర్ణ హాసిని (5), కుమారుడు అన్వేష్ నందా (7) ఉన్నారు. శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను తీసుకుని చింతల్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త, పిల్లలు కనబడకపోయే సరికి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు గాలింపు చేపట్టి.. చెరువులు వారి మృతదేహాలను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో తన సోదరుడికి రూ. 4 లక్షలు అప్పు ఇచ్చాడని, అవి తిరిగి ఇవ్వకపోగా అవమానించడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యం గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని భార్య ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+