కేటీఆర్‌కి ముద్దు పెట్టబోయిన యువతి.. వీడియో వైరల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు జులై 24న జరిగాయి. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ భవన్ లో ఆయన బర్త్ డే వేడుకలను నిర్వహించారు. అయితే ఓ మహిళ కేటీఆర్ వద్దకు వచ్చి సెల్ఫీ దిగింది. అనంతరం ఆమె చేసిన పని చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
జులై 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ కేకు కట్ చేశారు. అయితే ఓ మహిళ మాత్రం కేటీఆర్ కేక్ కట్ చేసిన తర్వాత విషెస్ చెప్పడానికి దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత కేటీఆర్ తో సెల్ఫీ తీసుకుంది. ఆ తర్వాత కేటీఆర్ ను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆయన వద్దంటూ నెట్టేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తెలంగాణ భవన్ లో కేటీఆర్ కు ముద్దు పెట్టబోయిన ఓ యువతి
— Tharun Reddy (@Tarunkethireddy) July 24, 2025
ఒద్దంటూ వెనక్కి జరిగిన కేటీఆర్
VC - @TNewsTelugu pic.twitter.com/fweOpssuHJ
మరోవైపు కేటీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా.. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సహాయం అందించారు. బోయిగూడలోని సెయింట్ ఫిలోమెనాస్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో.. విద్యార్థుల సౌకర్యార్థం 100 బెంచీలను ఇచ్చారు. అంతేకాక ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువులో తొలి రెండు స్థానాల్లో ప్రతిభ కనబరిచిన 20 మంది స్టూడెంట్స్ కు సైకిళ్లను గిఫ్ట్ గా ఇచ్చారు.

మరోవైపు తన పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ తండ్రి కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, పుత్రుడు హిమాన్షుతో కలిసి ఎర్రవల్లి నివాసానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా కుమారుడిని ఆశీర్వదించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్.












Click it and Unblock the Notifications