లవ్ బ్రేకప్.. ఆత్మహత్య చేసుకున్న యువ యూట్యూబర్ 'కోమలి'

హైదరాబాద్‌లో నగరంలోని రాయదుర్గం పరిధిలో యువ యూట్యూబర్ కోమలి మృతి చెందడం కలకలం రేపింది. మణికొండ చిత్రపురి కాలనీలో బంధువుల ఇంట్లో నివసిస్తున్న ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

కాగా 21 ఏళ్ల కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుకుంటూ పార్ట్‌టైమ్‌గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్‌స్టైల్, డైలీ వ్లాగ్స్, వ్యక్తిగత అనుభవాలకు సంబంధించిన వీడియోలతో ఆమెకు యువతలో ఫాలోయింగ్ పెరిగింది.

youtuber-komali-from-hyderabad-committed-suicide-due-to-issues-in-love-relationship-with-her-boy-fri

ప్రేమ పరిచయం... తరువాత విభేదాలు

అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారినట్లు తెలిసింది. సుమారు మూడు సంవత్సరాలు కొనసాగిన ఈ సంబంధం ఏడాది క్రితం మనస్పర్థల కారణంగా ముగిసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బ్రేకప్ తరువాత కోమలి తీవ్ర భావోద్వేగ ఒత్తిడికి లోనైనట్లు సమాచారం.

గతంలోనూ ఆందోళనకర పరిస్థితులు..

బ్రేకప్ తర్వాత కోమలి మానసికంగా కుంగిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకుని కాపాడినట్లు సమాచారం. ఇటీవల మళ్లీ ఇద్దరి మధ్య సంభాషణలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

తిరుమల పాదయాత్ర వీడియో వైరల్..

తన వ్యక్తిగత కోరిక నెరవేరాలని కోరుకుంటూ కోమలి Tirumalaకు కాలినడకన వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ చేసిన ఆ పాదయాత్ర వీడియో ఆమె చివరి పోస్టుగా నిలిచింది.

ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులను ప్రశ్నిస్తూ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా ఒత్తిడి, వ్యక్తిగత భావోద్వేగాలు వంటి కోణాలపై కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+