ప్రణీత్ హనుమంతు అరెస్ట్
యూట్యూబర్, నటుడు ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ తండ్రీకూతుళ్ల వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేయాలని పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో బెంగూరులో ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్ పై హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.
కాగా, ఓ తండ్రి తన కూతురితో కలిసి సరదాగా ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే, ఆ వీడియోపై డార్క్ కామెడీ పేరుతో యూట్యూబర్ ప్రణీత్ మరికొందరితో కలిసి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. తండ్రీ కూతుళ్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత హేయంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా ప్రమాదకరంగా మారిందని, పిల్లల ఫొటోలు/వీడియోలు పోస్ట్ చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సాయి తేజ్ తల్లిదండ్రులకు సూచించారు.
'కట్టడి చేయలేనంతగా సోషల్ మీడియాలు క్రూరంగా, భయానకంగా మారిపోయాయి. కొన్ని మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని పేరెంట్స్ అందరికీ నా విజ్ఞప్తి. మీ పిల్లల ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించండి. ఎందుకంటే, సోషల్ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదు' అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు సాయిత్ తేజ్.
Thank you for bringing to our notice this issue @IamSaiDharamTej garu.
— Revanth Reddy (@revanth_anumula) July 7, 2024
Child safety is utmost priority for our Govt. Will look into this incident and take appropriate action. https://t.co/5fTG4ZiQYi
చిన్నారుల భద్రతపై ఆలోచించాల్సిన అవసరముందని సాయితేజ్ మరో పోస్టులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను అభ్యర్థించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఎక్స్(ట్విట్టర్) ఖాతాలను ట్యాగ్ చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. పిల్లల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సమస్యను తమ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన వారు.. నిందితులపై కఠిన ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిందితుడు ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications