నటికి లైంగిక వేధింపులు: యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా అరెస్ట్
Hyderabad: ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో సహచర నటిని వేధించిన కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వెబ్ సీరిస్ షూటింగ్ సమయంలో యువతిని లైంగిక వేధింపులకు గురి చేయడంతోపాటు, పలుమార్లు అసభ్య పదజాలంతో దూషించాడు ప్రసాద్ బెహ్ర. షూటింగ్ సమయంలో యువతి ప్రయివేట్ భాగాలను తాకుతూ ఆమెపై ప్రసాద్ బెహరా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ప్రసాద్ బెహ్ర వేధింపులపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత యువతి. దీంతో ప్రసాద్ బెహరాపై 75(2),79,351(2)BNS సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత ప్రసాద్
బెహరాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
'మా విడాకులు'.. 'పెళ్లి వారమండి'.. 'మెకానిక్' వెబ్ సిరీస్‌లతో పేరు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహరా. ఇటీవల రిలీజయిన కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్ర.
పెళ్లివారమండి అనే వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ పరిచయమయ్యాడని, షూట్ సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. అతడ్ని నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడని బాధితురాలు వెల్లడించారు. ఆ తర్వాత మెకానిక్ అనే వెబ్ సిరీస్‌లో కలిసి పనిచేశామని, ఆ సమయంలోనూ అందరి ముందూ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు.
ఇదేమిటని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించాడని, డిసెంబర్ 11న షూట్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్ అందరి ముందు తనను కొట్టాడని బాధితురాలు తెలిపారు. ఎందుకు కొట్టావు అని అడగ్గా 'అందరి ముందు జోక్ చేద్దామని' అని అన్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె బెహరా ప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications