కేసీఆర్ దేనిలోనైనా దూకు.. తెలంగాణకు పట్టిన శని పోతుంది : వైఎస్ షర్మిల
తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను హైదారబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్టు చేసి ఆమెను నేరుగా బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ .. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు వైఎస్ షర్మిల నిరసస దీక్షకు దిగారు. ప్రభుత్వం దిగివచ్చేవరకు వెనక్కి తగ్గేది లేదని బైఠాయించారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం మనకొద్దని... వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ రాజీనామా చేయాలి..
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు, వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ కోసం డిమాండ్ చేస్తే.. అరెస్ట్ చేయడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. తెలంగాణలో లక్ష 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగులు ఆత్మహత్యలు..
తెలంగాణలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా .. ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ఏ మాత్రం చలనం రావడంలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం చేతకాని కేసీఆర్ దేనిలోనైనా దూకితే .. తెలంగాణకు పట్టిన శని పోతుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ కు దేశంలో ఉన్న నిరుద్యోగం కన్పిస్తుంది కానీ, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం సమస్య మాత్రం కన్పించదా? అని నిలదీశారు.

టీఆర్ఎస్ సర్కార్‌కు గుణపాఠం తప్పదు..
కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని షర్మిల విమర్శించారు. మాయ మాటలతో ఇంత కాలం ప్రజలను, రైతులను, నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్పీ ఛైర్మన్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. అంటే నిరుద్యోగుల పట్ల కేసీఆర్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో దళితుల్ని ముఖ్యమంత్రి చేసినప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్‌కు పాడేకట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications