హైదరాబాద్ లో నేటి నుంచి వివేకా కేసు విచారణ-సీబీఐ కోర్టు ముందుకు ఐదుగురు నిందితులు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కడప నుంచి హైదరాబాద్ కు చేరింది. ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో ప్రారంభమయ్యే విచారణకు ఐదుగురు నిందితులు హాజరుకానున్నారు.
నాలుగేళ్ల క్రితం ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోందన్న విమర్శలు ఓవైపు, నిందితుల నుంచి సాక్షులకు బెదిరింపుల నేపథ్యంలో హైదారాబాద్ కు మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇవాళ ప్రారంభించబోతోంది.
హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరిగే వైఎస్ వివేకా కేసు విచారణకు హాజరు కావాలని ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు ఆదేశాలు పంపింది. ఇందులో ఇప్పటికే జైల్లో రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ప్రొడక్షన్ వారంట్ జారీ చేసిన సీబీఐ కోర్టు.. బెయిల్ పై ఉన్న మరో ఇద్దరు నిందితులుఎర్ర గంగిరెడ్డి, దస్తగిరికి సమన్లు జారీ చేసింది. దీంతో ఈ ఐదుగురు సీబీఐ కోర్టు ముందు హాజరుకాబోతున్నారు. వీరంతా హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు తొలిసారి హాజరవుతున్నారు.

హైదరాబాద్ కు వివేకా కేసు సీబీఐ విచారణ మారిన నేపథ్యంలో సీబీఐ దూకుడు కూడా పెంచింది. ఇంతకాలం ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ పిలిపించి ప్రశ్నించిన సీబీఐ.. ఆ తర్వాత పులివెందులకు సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి సహాయకుడు నవీన్ ను పిలిపించి విచారించింది. ఇవాళ సీబీఐ కోర్టు విచారణ ఆధారంగా మరిన్ని చర్యలకు సీబీఐ సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే ఈ కేసుతో తమను రాజకీయంగా టార్గెట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ నేత సజ్జల వంటి వారు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications