వైఎస్ షర్మిల అరెస్ట్ - పాదయాత్ర అనుమతి రద్దు..!!
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అరెస్ట్ అయ్యారు. షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేసారు.
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అరెస్ట్ అయ్యారు. షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేసారు. మహబూబా బాద్ ఎమ్మెల్యే శంకర్ శంకర్ నాయక్ పైన షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయటం పైన కేసు నమోదు చేసారు. అరెస్ట్ చేసిన షర్మిలను హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం. పాదయాత్రలో భాగంగా..షర్మిల స్థానిక ఎమ్మెల్యేపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు.
ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ షర్మిల పాదయాత్రను మహబూబాబాద్ బేతోలులో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.ఈ నేపథ్యంలోనే షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసారు.

వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రస్తుతం మహబూబాబాద్ లో కొనసాగుతోంది. అయితే, శంకర్ నాయక్ పైన షర్మిల చేసిన వ్యాఖ్యల పైన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ వేశారు. శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ అని ధ్వజమెత్తారు.
మహబూబాబాద్ జిల్లా నెళ్ళికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన షర్మిల.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మాటలతో ఎదురు దాడి చేశారు. మీరు చేసిన మోసాలు ఎత్తి చూపిస్తున్నందుకు భయపడాలా అని ప్రశ్నించారు. మీ నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు, శంకర్ నాయక్ ఒక కబ్జా కోర్ అని అరోపించారు. జనాల దగ్గర భూములు గుంజుకోడమే ఆయనకు తెలుసు..అంటూ షర్మిల తీవ్ర ఆరోపణలు చేసారు.

షర్మిల పైన పోలీసులు కేసు నమోదు చేసారు. నేటి పాదయాత్రకు సిద్దం అవుతున్న సమయంలో మహబూబాబాద్ సమీపంలో బేతోలులో దగ్గర షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసారు. హైదరాబాద్ తరలిస్తున్నట్లుగా చెబుతున్నారు. షర్మిల అరెస్ట్ పైన వైఎస్సార్టీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. షర్మిల పాదయాత్ర మార్చి5వ తేదీతో ముగియనుంది.
షర్మిల తాను పోటీ చేయాలని భావిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరులో పాదయాత్ర ముగింపు సభకు నిర్ణయించారు. మొత్తం 4,111 కిలో మీటర్ల వద్ద పాదయాత్ర ముగిసేలా ప్లాన్ చేసారు. ఇప్పుడు మహబూబా బాద్ లో షర్మిల అరెస్ట్..పాదయాత్రకు అనుమతి రద్దు చేయటంతో షర్మిల ఏ విధంగా స్పందిస్తారు..ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications