అయ్యో జొమాటో బ్రదరూ.. ఫుడ్ డెలివరీకి వెళ్తూ.. డ్రైనేజీలో కొట్టుకుపోయాడు..
హైదరాబాద్ లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో రోడ్డుపై ఎక్కడ గుంటలు ఉన్నాయి. ఎక్కడ మాన్ హోల్స్ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్లపైకి రావాలంటేనే జనాలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ప్రమాదవశాత్తూ డ్రైనేజీలో పడిపోయి కొట్టుకుపోయాడు. అయితే స్థానికుల సాయంతో బతికి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
A Zomato delivery person fell into a drainage near TKR Kaman during heavy rain yesterday - bike and phone gone. https://t.co/PnqtqTHPoI pic.twitter.com/Bbqg4y2Cj1
— Naveena (@TheNaveena) August 10, 2025
The @TGPWU Demands @zomato Take Full Responsibility After Delivery Worker Syed Farhan Falls into Drainage During Hyderabad Rains
— Telangana Gig and Platform Workers Union (@TGPWU) August 10, 2025
On 9 Aug 2025, Zomato delivery worker Syed Farhan fell into an open drainage near TKR Kaman during heavy rain, losing his bike and phone. 1/3 https://t.co/KezdQqiYCp pic.twitter.com/jHl91Mw31F
హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక గంట వర్షం పడితేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో నగరంలోని రోడ్లపైన డ్రైనేజీలన్నీ ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో ఓ జొమాటో డెలివరీ బాయ్ ఓపెన్ డ్రైనేజీలో పడిపోయిన ఘటన అందరినీ కలచివేస్తోంది.

ఈ ఘటన ఎల్బీ నగర్ పరిధిలోని టీకేఆర్ కమాన్ వద్ద జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. డెలివరీ బాయ్ డ్రైనేజీలో పడిపోవడంతో తన ఫోన్, కొత్త బైక్‌ను కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఓ తాడు సాయంతో బయటకు తీశారు. అయితే అక్కడ కనీసం హెచ్చరిక బోర్డు కూడా పెట్టకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులపై నగరవాసులు మండిపడ్డారు. అటు డెలివరీ సంస్థలు ఉద్యోగుల భద్రతను విస్మరిస్తున్నాయని సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తాయి.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"











Click it and Unblock the Notifications