ఆ రెండు రోజుల్లో తిరుమలలో..

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. శని, ఆదివారాల్లో ఉన్నంత తాకిడి సోమవారం లేదు. అయిదు కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటోన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి అయిదు గంటల సమయం పడుతోంది. సోమవారం 69,781 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 27,552 మంది తలనీలాలను సమర్పించారు. మొక్కులు చెల్లించారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 5.16 కోట్ల రూపాయలు.

శని, ఆదివారాల్లో తిరుమలకు భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే. లక్షలాది మంది శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు రోజుల్లోనే సుమారు రెండు లక్షల మంది భక్తులు ఏడుకొండలవాడిని సేవించుకున్నారు. వివిధ సేవల్లో పాల్గొన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు.

A total of 1.72 lakh devotees had darshan of Lord Venkateswara

వారాంతపు రోజుల్లో తిరుమలకు వచ్చే వారి సంఖ్య అసాధారణ స్థితిలో ఉంటుంది. కిందటి వారం కూడా అదే కనిపించింది. శని, ఆదివారాల్లో 1,71,579 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మధ్యకాలంలో రెండు రోజుల వ్యవధిలో ఇంత మంది శ్రీవారిని దర్శించుకోవడం ఇదే ప్రథమం. భక్తుల తాకిడి ఉంటుందని ముందుగానే అంచనా వేసిన టీటీడీ అధికారులు దీనికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నుంచే అదనపు సౌకర్యాలను కల్పించారు.

శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు టీటీడీ అధికారులు. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించారు. శ్రీవాణి ట్రస్ట్ వంటి ఇతర చెల్లింపు ఆధారిత దర్శనాలను గణనీయంగా కుదించారు. వాటి స్థానంలో సామాన్య భక్తుల దర్శన సమయాన్ని పెంచారు. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. స్వామివారిని దర్శంచుకున్న సామాన్య భక్తుల సంఖ్య భారీగా పెరిగడానికి కారణమైంది.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి గార్డెన్స్, క్యూ కాంప్లెక్స్ బయట క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, మంచినీటిని అందించారు. శని, ఆదివారాల్లో టీటీడీకి హుండీ ద్వారా సుమారు తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా ఆదాయం అందింది. శనివారం 4.21 కోట్ల రూపాయలు, ఆదివారం 4.86 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది. ఈ రెండు రోజుల్లో 72,000 మంది యాత్రికులు తల నీలాలను సమర్పించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+