శభాష్ శ్యాం సుందర్.. కూతురికి సెల్యూట్ చేయడంపై చిరు స్పందన.. ఎందరికో స్ఫూర్తి అంటూ..
తిరుపతిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా అపురూప దృశ్యం ఆవిష్కృతమయ్యింది. సీఐ శ్యాంసుందర్ తన కుమార్తె, గుంటూరు అర్బన్ (సౌత్) డీఎస్పీ జెస్సీ ప్రశాంతికి సెల్యూట్ చేశారు. ఇదీ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యింది. శ్యాం సుందర్ కూతురా.. చిన్నారికి సెల్యూట్ చేశాడా అని ఒక్కే చర్చ.. అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఆ ఫొటోలో ఉంది తండ్రి-కూతురు అని చిరంజీవి వివరించారు. తండ్రి సీఐ శ్యాంసుందర్, కూతురు డీఎస్పీ మిస్ జెస్సీ ప్రశాంతి అని పేర్కొన్నారు. గుండెలమీద ఎత్తుకుని పెంచిన బిడ్డ, తనపై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్‌లో బోలెడంత సంతృప్తి ఉందన్నారు చిరంజీవి. ఆ ఫోటో చూస్తుంటే కాసింత గర్వం, ప్రేమ కూడా కనిపిస్తోందని చెప్పారు. శ్యాంసుందర్ గారూ, మీకు నేను సెల్యూట్ చేస్తున్నా అంటూ చిరంజీవ్ ట్వీట్ చేశారు. ఇలా మీరు చేసిన సెల్యూట్ వల్ల మీరెందరికీ స్ఫూర్తిగా నిలిచారని చిరంజీవి తెలిపారు.
కూతురికి సీఐ చేసిన సెల్యూట్ నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు శభాష్ అంటూ కీర్తిస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రతీ ఒక్కరు శ్యాం సుందర్‌ను అభినందిస్తున్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications