TTD: తిరుమలలో మరోసారి - ఆగమ శాస్త్రానికి విరుద్దంగా, పట్టని కేంద్రం..!!

Tirumala: తిరుమలలో మరోసారి విమానాలు శ్రీవారి ఆలయం సమీపంలో వెళ్లాయి.ఆగమ శాస్త్ర నియమావళి ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం నిషిద్ధం. ఈ మధ్య కాలంలో తరచూ శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు వెళ్లటం పైన ఆందోళన వ్యక్తం అవుతోంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావటంతో దీని పైన పలు మార్లు టీటీడీ అధికార్లు పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. అయినా, కేంద్రం స్పందించటం లేదు.

ఆగమశాస్త్రం ప్రకారం
ఆగమశాస్త్ర నియామవళి ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరకూడదు. కొంత కాలంగా తరచూ శ్రీవారి ఆలయం..వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం మీదుగా విమానాలు వెళ్లటం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం వరుసగా ఒకే రోజు మూడు విమానాళు శ్రీవారి ఆలయం మీదుగా వెళ్లాయి.

TTD:

స్వామివారి ఆలయం సమీపం నుంచే ఇవి వెళ్లడంతో తీవ్ర కలకలం రేగింది. తిరుమల గగనతలంలో హెలికాప్టర్లు ప్రయాణించడంపై టీడీడీ అప్రమత్తమైంది. ఆ హెలికాప్టర్లు ఎక్కడివన్న దానిపై టీటీడీ విజిలెన్స్‌ అధికారులు సమాచారం సేకరించే ప్రయత్నం చేసారు. పదే పదే శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు వెళ్లటం పైన టీటీడీ వెంటనే కేంద్రంతో చర్చించింది.

టీటీడీ కోరినా
అయితే, తాము ఈ నిబంధన అమలు చేయటం వీలుకాదని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రక్షణ పరంగా సమస్య ఉన్న ప్రాంతాలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటిస్తారు. తిరుమలకు ఉన్న ప్రత్యేకత..విశిష్ఠత కారణంగా నో ఫ్లయింగ్ జోన్ లోకి తీసుకురావాలని ప్రతిపాదించినా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు.

TTD:

దీంతో తిరుమల మీదుగా విమానాలు..హెలికాఫ్టర్లు వెళ్లిన సమయంలో టీటీడీ అధికారులు విమానయాన శాఖకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆ విమానాలు రాకపోకలపైన ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ భద్రతా సిబ్బందితో పహారా ఏర్పాటు చేసారు.

కేంద్రం స్పందించేనా
నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ భద్రతా సిబ్బందితో పహారా ఏర్పాటు చేసారు. గగనతలంలో మాత్రం సమస్యగా మారుతోంది. నెల రోజుల సమయంలో మూడు సార్లు విమానాలు ఇలా ఆలయానికి అతి సమీపంలో ప్రయాణిచటంపైన భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఆలయం సమీపంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలనేది భక్తుల కోరిక. ఇప్పటికైనా కేంద్రం స్పందిస్తుందా లేదా చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+