రుయా ఆస్పత్రిలో సైకోల హల్‌చల్, బ్లేడుతో కోసుకోవడంతో బెంబేలెత్తిన రోగుల బంధువులు, నర్సులు
రుయా ఆస్పత్రిలో సైకోలు హల్‌చల్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ.. నలుగురు సైకోలు వచ్చారు. అక్కడున్న రోగులే కాదు సిబ్బంది కూడా హడలెత్తిపోయారు. వారిని మెల్లిగా పంపిద్దామనుకొంటే సెక్యూరిటీ సిబ్బందితో కూడా గొడవకు దిగారు. వారి చేతుల్లో బ్లేడులు ఉండటంతో వారిని పట్టుకొని పంపించే ధైర్యం చేయలేకపోయారు. ఇటు రోగులు, నర్సులు కూడా బెంబేలెత్తిపోయారు.
ఆస్పత్రి గేటు సమీపంలో సైకోలు బీభత్సం సృష్టించారు. తమ చేతిలో ఉన్న బ్లేడుతో ఒంటిపై గాయాలు చేసుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. సైకోల ప్రవర్తనతో ఒకింత షాక్ వచ్చినట్లైంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వెంటనే రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకోవడంతో అక్కడున్న వారు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

వాస్తవానికి సైకోలను సెక్యూరిటీ లేదంటే.. అక్కడున్న రోగుల బంధువులు పట్టుకోవాలని చూశారు. కానీ వారి చేతిలో బ్లేడు ఉండటంతో భయపడ్డారు. ఒకరికొకరు బ్లేడుతో గాయం చేసుకోవడంతో రక్తం వచ్చింది. దీంతో రోగుల బంధువులు, నర్సులు పరుగు తీశారు. వారి ప్రవర్తనతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వీరి బారి నుంచి తప్పించుకోవడం ఎలా అని ఊహించుకున్నారు. వెంటనే పోలీసులు వచ్చి.. వారిని అదుపులోకి తీసుకోవడంతో కాస్త రిలాక్స్ అయ్యారు. లేదంటే తమ పరిస్థితి ఏంటి అని రోగుల బంధువులు వాపోతున్నారు. సైకోల ప్రవర్తనతో అక్కడున్న వారంతా షాక్‌నకు గురైన పరిస్థితి నెలకొంది
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications