TTD కీలక నిర్ణయం.. కొండపై వసతి కష్టాలు తొలగినట్లే!

తిరుమలలో 60 సంవత్సరాల క్రితం నిర్మించిన కట్టడాలనే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు

తిరుమలలో సామాన్య భక్తులకు అగ్ర తాంబూలం ఇచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. తిరుమలలో స్వామిని దర్శించుకునే భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. పాలక మండలి సమావేశంలో ఆమోదం పొందితే కొండపై భక్తులకు వసతి కష్టాలు తొలగిపోయినట్లే అవుతుంది. భక్త సులభుడైన వేంకటేశుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇలా దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కొండపైకి చేరుకుంటున్న భక్తులకు అత్యంత ముఖ్యమైంది వసతి సదుపాయం.

తిరుమలలో 60 సంవత్సరాల క్రితం నిర్మించిన కట్టడాలే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు వాటికి మరమ్మతులు నిర్వహించి స్వల్పకాలికంగా ఉపయోగపడేటట్లు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లగా పాత భవనాల స్థానంలో నిర్మాణాలు చేపట్టాలని తలపోస్తోంది. వాటిని పూర్తిగా తొలగించబోతోంది. కొండపై దాదాపు 7500 గదులను భక్తులకు కేటాయిస్తున్నారు.

The difficulty of accommodation on the hill is removed

నాలుగు సంవత్సరాల నుంచి పలు కాటేజీలకు కోట్లరూపాయల వ్యయంతో మరమ్మతులు నిర్వహిస్తూ వస్తున్నారు. అన్నింటిలో గీజర్లు, టైల్స్, లీకేజీలు లేకుండా చేస్తున్నారు. సుదర్శన్, గోవర్దన్, కల్యాణి సత్రాలను కూడా దశలవారీగా మరమ్మతులు చేపడుతున్నారు. కాకపోతే అవి నిర్మాణం జరిగి చాలాకాలం కావడంతో నిత్యం వీటిలో లీకేజీలు, చిన్నపాటి సమస్యలు వెలుగు చూస్తున్నాయి.

సుదర్శన్ లో 388 గదులు, గోవర్ధన్ లో 190, కల్యాణిలో 200 చొప్పున గదులున్నాయి. వీటినే భక్తులకు కేటాయిస్తున్నారు. తరుచుగా సమస్యలు వెలుగుచూస్తుండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించిన టీటీడీ వీటిని పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో అధునాతన వసతులతో కొత్త నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ఒకేసారి అన్నింటినీ తొలగిస్తే గదులకు కొరత ఏర్పడే ప్రమాదముండటంతో ఒక్కో సత్రాన్ని కూల్చివేసి, ఆ స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని భావిస్తోంది. ప్రతి సత్రంలోను కారు పార్కింగ్, ఏసీ గదులు, నాన్ ఏసీ గదులు, గీజర్లు, కల్యాణకట్ట వంటి సదుపాయాలు కల్పించనుంది. పాలకమండలిలో చర్చ జరిపి తర్వలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే భక్తులకు నిజంగా ఇది శుభవార్తే అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+