ఏపీలోనూ 5జీః ఆ మూడు నగరాల్లో.. ఎప్పటినుంచి అంటే..?
ఇప్పుడు అంత 5జీ గురించి చర్చ.. అవును ప్రధాని మోడీ లాంచ్ చేసిన తర్వాత అంత ఒక్కటే డిస్కషన్. ఎయిర్ టెల్ కూడా ఎంపిక చేసిన నగరాల్లో సర్వీస్ ఇస్తోంది. జియో కూడా అంతే వేగంగా సేవలు అందజేస్తోంది. తొలుత మెట్రో నగరాల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
దీంతో టైర్-2, టైర్-3 నగరాల పరిస్థితి ఏంటీ అనే చర్చ వచ్చింది. దీనికి జియో సమాధానం చెబుతోంది. చిన్న నగరాలకు కూడా సర్వీస్ ఇస్తామని అంటోంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక మెట్రో నగరం కూడా లేదు. దీంతో ఆ రాష్ట్రానికి తీపి కబురును జియో అందజేసింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితోపాటు కొన్ని ప్రధాన పట్టణాల్లో 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతుంది.

ప్రస్తుతం జియో 5జీ సేవలు ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, వారణాసిలో అందుబాటులో ఉన్నాయి. జియో కస్టమర్స్ 5జీ సేవలను పొందేందుకు 'జియో వెల్కమ్ ఆఫర్' తీసుకొచ్చింది. 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా లభిస్తుంది. వెల్కమ్ ఆఫర్ టారిఫ్ గురించి అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. రూ. 239తో మినిమం రీచార్జ్ ప్లాన్ తీసుకొస్తున్నట్టు జియో తెలిపింది. తక్కువ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకునే యూజర్లకు వెల్కమ్ ఆఫర్ వర్తించదు. దీంతో ఉచితంగా 5జీ సేవలను వినియోగించుకోలేరు. ఈ ప్లాన్ 4జీ డేటాతో వస్తుంది.
జియో కు 42.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వారిని పదిలంగా ఉంచుకుంటూనే మరికొందరు యూజర్ల తమ వైపు రావాలని అనుకుంటోంది. ఇటు 5జీ డేటా వేగం గణాంకాలను ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా రిలీజ్ చేసింది. రిలయన్స్ జియో 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడింగ్ వేగాన్ని నమోదు చేసింది. ఇదీ ఎయిర్ టెల్ కన్నా ఎక్కువేనని సదరు కంపెనీ చెబుతోంది. జియోకు ఎయిర్ టెల్ పోటీ.. వీఐ ఆ స్థాయిలో ప్రభావం చూపడం లేదు. బీఎస్ ఎన్ఎల్ ఉన్న.. ఆ నెట్ వర్క్ ఆశించిన స్థాయిలో కస్టమర్లు లేరు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications