గంగుల కామెంట్స్ అహంకారానికి నిదర్శనం: ఏపీ మంత్రి వేణుగోపాల కృష్ణ

తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య డైలాగ్ వార్ పీక్‌కి చేరింది.మంత్రి గంగుల కమలాకర్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. దీనికి ఏపీ మంత్రులు కౌంటర్ అటాక్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ తాజాగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పందించారు. కమలాకర్ చేసిన కామెంట్స్ సరికాదని పేర్కొన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం అని మంత్రి వేణుగోపాల కృష్ణ విమర్శించారు. రాజకీయాల్లో ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం సరికాదని హితవు పలికారు.ఏపీ ఉద్యోగుల విషయంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారని స్పష్టం చేశారు. తమతో పెట్టుకుంటే ఏమైనా చేస్తాం అనే కామెంట్లను మంత్రి గంగుల విత్ డ్రా చేసుకోవాలని వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు.

andhra pradesh minister venugopala krishna fire on gangula kamalakar

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్‌నాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమపై కామెంట్స్ చేస్తున్నారని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. తెలంగాణ విషయాల్లో తలదూర్చితే బాగుండదని, పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టొద్దని వైసీపీ నేతలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ బీజేపీకి బీ పార్టీగా నిలుస్తోందని ఆరోపించారు. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టేలా జగన్ ప్రభుత్వం చూస్తోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌లు టీఆర్ఎస్‌ కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని గంగుల మండిపడ్డారు.సజ్జల తమతో ఎందుకు పెట్టుకుంటున్నారని గంగుల ప్రశ్నించారు. మా సంగతి తెలియదా..? గతంలో చూశారుగా, మళ్లీ చూస్తారా అంటూ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+