డ్రైవర్ కొడాలి నాని: ఆర్టీసీ బస్ నడుపుతూ: జగన్ క్లాస్ తీసుకున్న తరువాత దూకుడు..!!

అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీపరంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీపడట్లేదు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు.ఇందులో భాగంగా తరచూ వర్క్‌షాప్‌‌లను నిర్వహిస్తోన్నారు.

మరో దఫా కీలక భేటీ..

మరో దఫా కీలక భేటీ..

ఈ క్రమంలో వైఎస్ జగన్ రెండురోజుల కిందటే తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మరోసారి పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు.. ఇందులో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏ మేరకు అందుబాటులో ఉంటోన్నారు?, సమస్యల పరిష్కారం చూపుతున్న చొరవ, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై మెజారిటీ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలపై ఇప్పటికే ఆయన ఓ నివేదికను తెప్పించుకున్నారు.

నిఘా ఉంచారంటూ నాని

నిఘా ఉంచారంటూ నాని

ఈ భేటీ ముగిసిన అనంతరం మాజీ మంత్రి, గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని విలేకరులతో మాట్లాడారు. తనలాంటి కొంతమంది ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ పీకారని స్పష్టం చేశారు. బ్యాక్ బెంచ్ బాయ్స్ ను హెచ్చరించారని చెప్పారు. ఇకపై కుంటి సాకులు చెప్పి, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించకుండా తప్పించుకోలేమని స్పష్టం చేశారు. తక్కువ సమయం పాటు గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించిన వారిని జగన్ హెచ్చరించారని చెప్పారు.

టాస్క్ కంప్లీట్..

టాస్క్ కంప్లీట్..

తనలాంటి కొందరు ఎమ్మెల్యేలకు ఒళ్లు బద్ధకం పెరిగిందని, ఎక్కడికి వెళ్తే అక్కడే కూర్చుని పోవడం అలవాటైందని కొడాలి నాని అన్నారు. ఆయన స్కూలేమిటంటే ప్రజా ప్రతినిధులందరూ ప్రజలను కలుసుకోవాల్సిందేనని, తమలాంటి వాళ్లు కొంత బద్ధకిస్తుంటారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన టాస్క్ ను ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుందని, దీన్ని తాను నిర్వహిస్తానని స్పష్టం చేశారు. తనలాంటి కొందరు ఎమ్మెల్యేలపై జగన్ ఐప్యాక్ తో నిఘా పెట్టారని కొడాలి నాని వివరించారు.

రోజుకు ఆరు గంటలు..

రోజుకు ఆరు గంటలు..

రోజుకు కనీసం ఆరు గంటలైనా తిరగాల్సిందేనని జగన్ తమను హెచ్చరించినట్లు కొడాలి నాని అంగీకరించారు. ఈ విషయంలో ఆయన ఎలాంటి భేషజాలకు పోలేదు. తాను రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నానని వివరించారు. ఇకపై అది కుదరదని జగన్ తేల్చి చెప్పారని పేర్కొన్నారు.

జగన్ కు హామీ ఇచ్చినట్టే..

జగన్ కు హామీ ఇచ్చినట్టే..

దీని తరువాత కొడాలి నాని గేర్ మార్చారు. టాప్ గేర్ లో దూసుకెళ్తోన్నారు. బ్యాక్ బెంచ్ బాయ్ అనే ముద్ర చెరిపేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారాయన. తన కంచుకోట గుడివాడ నియోజకవర్గం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తోన్నారు. జగన్ కు హామీ ఇచ్చినట్టే- ఆరు గంటలకు పైగా ఆయన తన నియోజకవర్గంలో పర్యటిస్తోన్నారు. ప్రతి ఇంటినీ పలకరిస్తోన్నారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం కోసం సమాయత్తమౌతోన్నారు.

గుడివాడలో బస్ నడుపుతూ..

గుడివాడలో బస్ నడుపుతూ..

ఈ క్రమంలో ఆయన గుడివాడలో సందడి చేశారు. సరదాగా ఆర్టీసీ బస్సును నడిపించారు. గుడివాడ బస్టాండ్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరం పాటు ట్రాఫిక్ లో బస్సును డ్రైవ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొడాలి నాని కాస్తా డ్రైవర్ నాని గా మారిపోయారంటూ నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తోన్నారు.

https://twitter.com/oneindiatelugu/status/1625918619308937217?t=UgKNnePWeDf5k6n6zraYig&s=09

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+