లగ‌డ‌పాటికి స‌న్యాస‌మే మిగిలింది: కోత‌లు కోశారు.. అడ్డంగా బుక్క‌య్యారు: అక్టోప‌స్ ఎక్క‌డున్నారు..!

ఆంధ్రా అక్టోప‌స ఎక్క‌డ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీకి అనుకూలంగా చెప్పిన ల‌గ‌డపాటి త‌న అంచ‌నాలు నిజం అవుతాయ‌ని ధీమాగా చెప్పారు. అంచ‌నాలు త‌ప్పితే ఇక భ‌విష్య‌త్‌లో స‌ర్వేలు చేయ‌న‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు అదే చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రి..ఇంత ఫ‌లితాల హ‌డావుడి జ‌రుగుతుంటే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఎక్క‌డ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ అభిమానులు సోష‌ల్ మీడియాలో ల‌గ‌డ‌పాటిని ఒక ఆట ఆడుకుంటున్నారు...

ల‌గ‌డ‌పాటి స‌న్యాసం త‌ప్ప‌దు..

ల‌గ‌డ‌పాటి స‌న్యాసం త‌ప్ప‌దు..

ఇప్ప‌టికే రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న ల‌గ‌డ‌పాటి..టీడీపీ గెలుపు ఖాయ‌మ‌ని ఎగ్జిట్ పోల్స్‌లో తేల్చి చెప్పిన ల‌గ‌డ‌పాటి ఇప్పుడు ఎక్క‌డ ఉన్నార‌నే చ‌ర్చ మొద‌లైంది. త‌న అంచ‌నాలు తెలంగాణ‌లో త‌ప్పాయ‌ని..ఇక‌, ఏపీలో సైతం త‌న స‌ర్వే నిజం కాక‌పోతే ఇక తాను భ‌విష్య‌త్‌లో ఏనాడూ స‌ర్వేలు చేయ‌న‌ని తేల్చి చెప్పారు. ఇప్పుడు..ల‌గ‌డ‌పాటి చెప్పిన స‌ర్వేల అంకెల‌కు..వాస్త‌వ ఫ‌లితాల‌కు పొంత‌న లేకుండా పోయింది. ఇప్పుడు ఖ‌చ్చితంగా ల‌గ‌డ‌పాటి స‌ర్వేల నుండి స‌న్యాసం తీసుకోక త‌ప్ప‌టం లేదు. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ల‌గ‌డ‌పాటి ఇదే ర‌క‌మైన స‌ర్వే ఫ‌లితాలు ఇచ్చారు. అక్క‌డ కూడా ఆయ‌న చెప్పిన దానికి పూర్తి విరుద్దంగా వ‌చ్చిన ఫ‌లితాల‌తో టిఆర్‌య‌స్ విజ‌యం సాధించింది. దీంతో..ఏపీలో ఆయ‌న చెప్పిన ఫ‌లితాల మీద అనుమానాలు ఉన్నా..వాస్త‌వ ఫ‌లితాల వ‌ర‌కు వేచి చూసారు. ఇప్పుడు ఆ అనుమానాలే నిజ‌మ‌య్యాయి.

టీడీపీకి మేలు చేసేందుకే...స‌ర్వేనే చేయ‌లేదు

టీడీపీకి మేలు చేసేందుకే...స‌ర్వేనే చేయ‌లేదు

కేవ‌లం టీడీపీ అభిమానుల్లో మ‌నోస్థైర్యం నింపేందుకే ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఫ‌లితాలు టీడీపీకి అనుకూలంగా ఇచ్చారంటూ వైసీపీ నేత‌లు ఆరోపించారు. జాతీయ స్థాయిలో వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా తాను ఇచ్చిన స‌ర్వే ఫ‌లితాల పైనా ల‌గ‌డ‌పాటి స్పందిస్తూ జాతీయ స‌ర్వేల‌కు ఏపీ ఓట‌ర్ల గురించి స‌రైన అంచ‌నా లేద‌ని వ్యాఖ్యానించారు.

ఎగ్జిట్ పోల్స్

ఎగ్జిట్ పోల్స్

టీడీపీ అదినేత సైతం స‌ర్వే సంస్థ‌లు ఏపీ ప్ర‌జ‌ల నాడి ప‌ట్టుకోవ‌టంలో విఫ‌ల‌మ‌య్యార‌ని ఆరోపించారు. ఇక‌, ఇప్పుడు అస‌లు ఫ‌లితాలు రావ‌టం..ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఫ‌లితాలు ఉండ‌టంతో..ఇక‌, ల‌గ‌డ‌పాటి వైసీపీ శ్రేణుల‌కే కాదు .. టీడీపీ అభిమానుల‌కు టార్గెట్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+