కేశినేని నాని అవుట్- తేల్చేసిన టీడీపీ

విజయవాడ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- రాష్ట్రంలో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు దీనికి సన్నద్ధమౌతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల నాయకులు ఎవరి పంథాలో వాళ్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. ఎన్నికల వరకు ప్రజల మధ్యే గడపడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. దీనికోసం వేర్వేరు రూపాల్లో తమ కార్యక్రమాలను రూపొందించకుంటోన్నారు.

వైఎస్ఆర్సీపీ మా నమ్మకం నువ్వే జగన్.. అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..ఇందులో పాల్గొంటోన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అతికిస్తోన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాల కింద మంజూరయిన నిధుల వివరాలతో కూడిన బ్రోచర్లను లబ్దిదారులకు అందజేస్తోన్నారు.

Kesineni Nani Photo missing in TDP

వైఎస్ఆర్సీపీ చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్.. ప్రచారానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా రంగంలోకి దిగాయి. విజయవాడలో జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్లను అంటించిన ప్రతి ఇంటి వద్దా ఈ రెండు పార్టీల స్టిక్కర్లు వెలుస్తోన్నాయి. సైకో పోవాలి- సైకిల్ రావాలి- మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవ్వాలి అనే స్లోగన్‌తో తెలుగుదేశం పార్టీ నాయకులు స్టిక్కర్లను తయారు చేశారు. వాటిని విజయవాడలో ప్రతి ఇంటికీ అంటిస్తోన్నారు.

జనసేన పార్టీ కూడా టీడీపీ బాటలోనే నడుస్తోంది. మా నమ్మకం పవన్.. మాకు వద్దు జగన్ అనే లైన్‌ను అందుకుంది. పవన్ కల్యాణ్ ఫొటో ముద్రించి ఉన్న స్టిక్కర్లను విజయవాడలో ప్రతి ఇంటికీ అంటిస్తోన్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ పరిణామాలతో విజయవాడ రాజకీయాలు వేడెక్కాయి. స్టిక్కర్లను అతికించే కార్యక్రమం విజయవాడ పరిధిలో పోటాపోటీగా సాగుతోంది.

తెలుగుదేశం పార్టీ స్టిక్కర్లల్లో విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని ఫొటో మిస్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నానికి బదులుగా ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఫొటోను ముద్రించారు ఇందులో. ఒకవంక స్థానిక శాసన సభ్యుడి ఫొటో, మరోవంక కేశినేని చిన్ని ఫొటోను ముద్రించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు, అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ ఫొటోలు ఇందులో ఉన్నాయి.

సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ఫొటో లేకపోవడం చర్చనీయాంశమౌతోంది. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఆయనను దూరం పెట్టిందనడానికి ఇదే సాక్ష్యంగా తీసుకోవచ్చు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నానికి బదులుగా చిన్నికి విజయవాడ లోక్‌సభ టికెట్‌ను కేటాయించడం కూడా ఖాయమైందనే విషయాన్ని ఈ స్టిక్కర్ల ద్వారా స్పష్టం చేసినట్టయింది. సిట్టింగ్ ఎంపీనే అయినప్పటికీ ఆయనకు మూడోసారి టికెట్ ఇవ్వడాన్ని చంద్రబాబు, నారా లోకేష్ అంగీకరించట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+