ఇంటికి తీసుకెళ్లీ మరీ లైంగికదాడి..? ఫ్రెండ్ అని నమ్మితే నట్టేట ముంచిన నీచుడు..?

ఫ్రెండ్ అని ఓ యువతి నమ్మడమే పాపమైపోయింది. అతని ఇంటికి వెళితే ఊహించని నష్టం జరిగింది. అతను ఆమెపై లైంగికదాడి చేయబోయాడు. తర్వాత స్నేహితులుగా ఉన్న సమయంలో దిగిన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. కొల్లా మణికంఠ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని యువతి వాపోయింది. అంతకుముందు తనతో దిగిన ఫొటోలతో బెదిరించాడు. దీంతో యువతి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భవానీపురంలో ఆమె

భవానీపురంలో ఆమె

యువతి కుటుంబసభ్యులతో కలసి భవానీపురంలో నివాసం ఉంటోంది. హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తుంది. కరోనా నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం ఇవ్వడంతో భవానీపురంలో గల ఇంటి నుంచే జాబ్ చేస్తోంది. ఆమె ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో అదే కాలేజీలో ఎంబీఏ చదువుతున్న మణికంఠతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. సరదాగా మాట్లాడుకునే వాళ్లు. అంతేకాదు కలిసి ఫొటోలూ దిగారు.

ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడి..?

ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడి..?

ఆమె ఇంజినీరింగ్‌ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో మణికంఠ ఆమెను హెచ్‌బీకాలనీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఫ్రెండ్ కావడంతో యువతి అతడిని నమ్మి ఇంటికెళ్లింది. అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు మణికంఠ ప్రయత్నించాడు. అనూహ్య పరిణామంతో షాక్ తిన్న యువతి భయపడిపోయింది. ఎలాగో తప్పించుకుని అక్కడి నుంచి బయటపడింది.

పెళ్లి ప్రయత్నాల్లో ఉండగా..

పెళ్లి ప్రయత్నాల్లో ఉండగా..

ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె ఫొటోలను మ్యాట్రిమోనీ సైట్‌లో పెట్టారు. వాటిని చూసిన మణికంఠ మరింత రెచ్చిపోయాడు. గత మార్చి 25న నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. తననే పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. లేకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. ఆ తర్వాత ఏప్రిల్ 1న మరోసారి ఇంటికెళ్లి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడు.

ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్

ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్

ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాధిత యువతి భయాందోళనకు గురైంది. మరో దారి లేకపోవడంతో భవానీపురం పోలీసులను ఆశ్రయించింది. మణికంఠపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పుడెప్పుడో లైంగికదాడి యత్నం చేయడమే గాక.. పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. అతని వేధింపులు తాళలేక యువతి పోలీసులను ఆశ్రయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+