వంగవీటి రంగా జయంతి రోజున అభిమానులకు పిలుపునిచ్చిన రాధా
విజయవాడ: ఇవ్వాళ వంగవీటి మోహనరంగా 76వ జయంతి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విజయవాడలో రంగా కుమారుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, జనసేన పార్టీ నాయకులు పోతిన వెంకట మహేష్ సహా పలువురు నేతలు ఇందులో పాల్గొన్నారు. వంగవీటి రాధా-రంగ మిత్ర మండలి సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

తన తండ్రిని అభిమానులు కులం, మతం, పార్టీలకు అతీతంగా గుండెల్లో పెట్టుకున్నారని, ఓ నాయకుడు భౌతికంగా దూరమై ఇన్ని సంవత్సరాల తరువాత కూడా స్ఫూర్తిని ఇస్తోన్నారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలు, పేదలకు ఆయన చేసిన మంచి ఏమిటనేది చిరస్మరణీయమని, అందుకు వారి అభిమానమే నిదర్శనమని చెప్పారు.
భవిష్యత్తులో రంగా అభిమానులందరూ ఏకం కావాలని, సామాజిక, రాజకీయ రంగాల్లో ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రంగా పేరు చెప్పుకొని కొందరు నాయకులు రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగారని, ఇప్పుడు వారు పట్టించుకోవట్లేదని విమర్శించారు. రంగా పేరు చెప్పుకొంటోన్న పాలకులు ఆయన పేరును ఈ జిల్లాకు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.
1987లో రంగా చైతన్య రథం అనే సినిమా నిర్మించారని, అది విడుదలకు నోచుకోలేదని రాధా అన్నారు. రంగా జయంతి సందర్భంగా యన అభిమానులు ఈ మూవీని అమెరికాలో విడుదల చేశారని తెలిపారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోన్నామని రాధా చెప్పారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications