విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాధాతో వంశీ ఏకాంత చర్చలు: దుట్టా, యర్లగడ్డతో డైలాగ్ వార్.. ప్రాధాన్యం..

|
Google Oneindia TeluguNews

వంగవీటి రాధాకృష్ణ- వల్లభనేని వంశీమోహన్- కొడాలి నాని.. ముగ్గురు స్నేహితులు. ఏ పార్టీలో ఉన్న తరచు కలుసుకుంటారు. బాగోగులను అడిగి తెలుసుకుంటారు. కొడాలి నాని విషయం పక్కన పెడితే.. వంశీ ఇప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీకి మద్దతుగా ఉన్నారు. రాధా టీడీపీలో ఉన్నారు. ఆదివారం గన్నవరంలో వీరిద్దరూ ఓ ఫంక్షన్‌లో కలిశారు. వీరి కలిసి మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసలే వైసీపీ గన్నవరం టికెట్‌పై రగడం నెలకొంది. సరిగ్గా ఈ సమయంలోనే భేటీ జరిగింది.

కౌగిలించుకొని.. ఆప్యాయంగా..

కౌగిలించుకొని.. ఆప్యాయంగా..

ఇద్దరు నేతలు కౌగిలించుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. ఆ తర్వాత వంగవీటి రాధ భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ దగ్గరుండి రాధను వంశీ కారెక్కించారు. వంగవీటి రాధ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అంతకుముందు వైసీపీ నుంచి.. టీడీపీలోకి వచ్చారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. వైసీపీకి మద్దుతుగా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో వల్లభనేని వంశీ, గన్నవరం నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల మధ్య పోరు నడుస్తోంది.

దుట్టా, యార్లగడ్డతో వంశీకి విభేదాలు

దుట్టా, యార్లగడ్డతో వంశీకి విభేదాలు


వల్లభనేని వంశీపై దుట్టా రామచంద్రరావు మధ్య పొసగడం లేదు. టికెట్ అంశంపై వివాదం కంటిన్యూ అవుతుంది. మరో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుతో వంశీకి విభేదాలు కనిపిస్తున్నాయి. టికెట్ అంశంపై వీరి మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. ఈ అంశంపై రోజు వివాదం కొనసాగుతోంది. సరిగ్గా ఈ సమయంలో వంశీతో రాధా మంతనాలు ప్రయారిటీ నెలకొంది.

ఏకాంత చర్చలు

ఏకాంత చర్చలు


వల్లభనేని వంశీ- వంగవీటి రాధను కలవడం చర్చకు తెరలేపింది. ఇద్దరూ ఏకాంతంగా చర్చలు జరపడం మరింత పొలిటికల్ హీట్ పెంచింది. ఇద్దరు నేతలు ఏం చర్చించారు అనేది దానిపై ఆసక్తి నెలకొంది. నియోజకవర్గంలో వైసీపీ నేతల నుంచి వంశీకి సహకారం లేకపోవడంతో రాధతో తన పొలిటికల్ ప్రయాణంపై చర్చించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ ఇద్దరూ నేతలు రెగ్యులర్ మీట్ అవుతుంటారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. మీట్ ప్రాధాన్యం నెలకొంది.

English summary
vangaveeti radha meets vallabhaneni vamsi at function. both leaders are the good friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X