విశాఖకు మరో వరం: రాయలసీమలో రెండు నగరాలకూ: ఉద్యోగావకాశాలకు ఊతం ఇచ్చేలా
అమరావతి: రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ఆవిర్బవించబోతోన్న సాగర నగరం విశాఖపట్నానికి మరో వరం లభించింది. ఈ నగరాన్ని జగన్ సర్కార్ కాన్సెప్ట్ సిటీగా అభివృద్ధి చేయబోతోంది. విశాఖతో పాటు రాయలసీమలోని అనంతపురం, టెంపుల్ సిటీ తిరుపతిని దీనికోసం ఎంపిక చేసింది. ఈ మూడు నగరాలనూ కాన్సెప్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించిన శుక్రవారం వెలువడ్డాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
ప్రభుత్వం కొత్తగా ఎంపిక చేసిన మూడు నగరాలు వెనుక బడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందినవే. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ఏకీకృతం చేయడం, ఒకే చోట అభివృద్ధి చేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కాన్సెప్ట్ సిటీలకు రూపకల్పన చేసింది. ఐటీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల రంగం, దానికి అనుబంధ పరిశ్రమలన్నింటిని ఏర్పాటు చేయడానికి కాన్సెప్ట్ సిటీలు అనే కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చింది.

ఇదివరకే దీనిపై వైఎస్ జగన్ మూడ, నాలుగు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. దీనికి అనుగుణంగా అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన పనులను పర్యవేక్షిస్తుంది. ఐటీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను నెలకొల్పడానికి ఎంపిక చేసిన ఆయా నగరాల్లో మొదట ప్రభుత్వం ఎనిమిది నుంచి 10 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గుర్తిస్తుంది. అక్కడ ఈ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేస్తుంది.
Our Govt has announced the launch of #ConceptCities in Anantapur, Tirupati & Vizag with a vision to develop them as first of its kind model, with state-of-the-art world-class amenities & facilities with a walk to work concept. To emerge as Self-sustainable & Realistic in nature! pic.twitter.com/UVgn9DRvqh
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) August 7, 2020
Recommended Video
ఆయా చోట్ల పెట్టుబడులను పెట్టే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలను ఇస్తుంది. నీటి సౌకర్యం, రవాణా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో రాయితీలను ఇస్తుంది. పారిశ్రామిక విధానానికి అనుగుణంగా, దాని మార్గదర్శకాలకు లోబడి ఈ రాయితీలు ఉంటాయి. ఈ కాన్సెప్ట్ సిటీల వల్ల పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతాయని, పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా- వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొంటోంది.
-
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications