Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దివ్య కేసులో షాకింగ్ నిజాలు.. అంగట్లో ఆటబొమ్మగా.. లక్షకు అమ్మకం .. పిన్ని, భర్త అంతా రాక్షసులే !!.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివ్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.దివ్యను వ్యభిచార రొంపిలోకి దింపి, అత్యంత పాశవికంగా హతమార్చిన వ్యభిచార మాఫియాకు సంబంధించి తీగ లాగితే డొంకంతా కదులుతుంది. దివ్య పిన్ని కాంతవేణి తో పాటు, భర్త వీరబాబు, పిన్నితో సహజీవనం చేస్తున్న కృష్ణ, గీత, వసంతలు దివ్య జీవితంతో ఆడుకున్నారు.అంగడి బొమ్మను చేసి వాడుకున్నారు. చివరకు అత్యంత పాశవికంగా దివ్య ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు.

దివ్య జీవితాన్ని నాశనం చేసిన పిన్ని కాంతవేణి

దివ్య జీవితాన్ని నాశనం చేసిన పిన్ని కాంతవేణి

దివ్య తో పాటు,దివ్య తల్లి, అమ్మమ్మ, సోదరుడి మృతి కేసు కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక వీరి మరణంతో అనాథగా మారిన దివ్యను చేరదీసిన సొంత పిన్ని కాంతవేణి దివ్య జీవితాన్ని నాశనం చేసింది. అందంగా ఉన్న దివ్య తో వ్యభిచారం చేయిస్తే బాగా డబ్బు సంపాదించవచ్చు అని భావించి పక్కా ప్లాన్ ప్రకారం కాంతవేణి దివ్యను వ్యభిచార వృత్తిలోకి దింపింది. అప్పటికే వ్యభిచార వృత్తిలో ఉన్న కాంతవేణి దివ్యను బలవంతంగా, ఒత్తిడి చేసి వ్యభిచార కూపంలోకి దింపి నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

వీరబాబుతో పెళ్లి ... వ్యభిచారం చెయ్యమని భర్త , పిన్ని బలవంతం

వీరబాబుతో పెళ్లి ... వ్యభిచారం చెయ్యమని భర్త , పిన్ని బలవంతం

ఇక పెళ్ళికాని దివ్యతో వ్యభిచారం చేయిస్తే అందరూ అనుమానిస్తారని భావించి పిన్ని కాంతవేణి తనతో సహజీవనం చేస్తున్న కృష్ణ బంధువు వీరబాబు తో దివ్యకి పెళ్లి చేసింది. ఇక కృష్ణ, వీరబాబు, పిన్ని కాంతవేణిల ఒత్తిడితో దివ్య వ్యభిచారంలోకి దిగింది. ఇక ఆ తర్వాత దివ్యను కాంతవేణి, గీత అనే మరొక వ్యభిచార నిర్వాహకురాలికి లక్ష రూపాయలకు అమ్మేసింది. దానికి సంబంధించిన లావాదేవీలు కూడా గీత ఖాతా నుండి కాంతవేణితో సహజీవనం చేసిన కృష్ణ ఖాతాకు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.

లక్ష రూపాయలకు దివ్యను అమ్మిన పిన్ని

లక్ష రూపాయలకు దివ్యను అమ్మిన పిన్ని

ఇక దివ్యను కొనుక్కున్న గీత కొద్దిరోజుల పాటు తన వద్ద ఆశ్రయమిచ్చి దివ్యతో వ్యభిచారం చేయించింది.పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో తాత్కాలికంగా గీత వసంత అనే మరో నిర్వాహకురాలు దగ్గరికి దివ్యను పంపింది. ఇక అక్కడ వసంత దివ్య అందాన్ని ఎరగా వేసి, వ్యభిచారం చేయించి బాగానే డబ్బులు సంపాదించింది. ఆ తర్వాత గీత కూడా దివ్య తన దగ్గరకు తిరిగి పంపించాలని వసంత మీద ఒత్తిడి తెచ్చింది. అయితే వసంత దివ్య తన దగ్గర నుంచి వెళ్లిపోయినట్లుగా గీతకు అబద్ధం చెప్పింది. ఇక తన వద్దే ఉంచుకొని దివ్యతో బలవంతంగా వ్యభిచారం చేయించింది వసంత.

 ఒకరి నుండి ఒకరి వద్దకు దివ్య .. అంగట్లో ఆటబొమ్మ

ఒకరి నుండి ఒకరి వద్దకు దివ్య .. అంగట్లో ఆటబొమ్మ

ఇక దివ్య మృతి కేసులో ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది వ్యభిచార మాఫియా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దివ్య సొంత పిన్ని కాంతవేణి,ఆమె దగ్గరకు వచ్చే కృష్ణ, దివ్య భర్త వీరబాబు,ఆ తర్వాత గీత, గీత వద్ద నుండి వసంత ఇలా దివ్య జీవితం అంగడి బొమ్మలాగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది దివ్య జీవితంతో ఆటలాడుకున్నారు. ఇక వివరాలన్నింటినీ సేకరించిన పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న వసంతకు ఎదురు తిరిగిన దివ్య

బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న వసంతకు ఎదురు తిరిగిన దివ్య

వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించే ఒక ఆటబొమ్మ అని భావించి దివ్యను వేధింపులకు గురి చేసింది వసంత. వసంత వేధింపులు తట్టుకోలేక, కనీసం తనకు ఫోన్ కూడా ఇవ్వని వసంతతో ఉండలేక, తాను సంపాదించిన డబ్బులు కూడా తనకు ఇవ్వని తీరుతో విసుగు చెందిన దివ్య వసంతకు ఎదురు తిరిగింది. తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగింది. ఇక అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంది. ఇక దీంతో వసంత దివ్యను అడ్డు తప్పించుకోవాలని భావించి పక్కా ప్లాన్ తో ప్రాణం తీసింది .

Recommended Video

    Vizag Gas Leak : NGT Issues Notices To Centre & LG Polymers India
    అత్యంత క్రూరంగా హింసించి చంపేసిన వ్యభిచార మాఫియా

    అత్యంత క్రూరంగా హింసించి చంపేసిన వ్యభిచార మాఫియా


    దివ్యను కనుబొమ్మలు, గుండు గీకి అందవిహీనంగా తయారు చేయించి , కాళ్లు చేతులు కట్టేసి గదిలో బంధించి తిండి పెట్టకుండా, అట్లకాడతో ఒళ్ళంతా వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసి మరీ చంపింది. వ్యభిచార కూపంలో చిక్కి విలవిలలాడిన దివ్య జీవితం అర్థాంతరంగా ముగిసింది. గుట్టుచప్పుడు కాకుండా దివ్య మృతదేహాన్ని ఖననం చేద్దామనుకుంటే వ్యాను డ్రైవర్ కు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తీగలాగితే డొంక కదిలింది. వ్యభిచార మాఫియా ఎంతగా వేళ్ళూనుకుంది అనేది దివ్య కేసు ద్వారా బయటకు వచ్చింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+