ఏపీకి "పెథాయ్" తుపాన్ ఎఫెక్ట్.. కోస్తాంధ్రలో అలర్ట్
విశాఖపట్నం : ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీంతో కోస్తా ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం తుపాన్ గా మారే ఛాన్సుంది. దీనికి పెథాయ్ గా నామకరణం చేశారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు భారీ వర్షాలు పడే అవకాశముంది. 17వ తేదీన మధ్య కోస్తా వద్ద తీరం దాటనుంది. తుపాన్ ప్రభావాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షిస్తున్నారు.
వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. గురువారం రాత్రికి మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1250 కిలోమీటర్లు.. శ్రీహరికోట నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. శుక్రవారం నాటికి తుపాన్ గా బలపడనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video


తుపానుగా మారిన తర్వాత వాయవ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం ప్రకటన విడుదల చేసింది. అయితే శనివారం నాటికి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనున్నట్లు తెలిపింది. తుపాన్ ఎఫెక్ట్ తో శుక్రవారం గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని.. తీవ్ర తుపాన్ గా మారిన తర్వాత శనివారం 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరంలో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది.
మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో శని, ఆదివారాల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. తీవ్ర వాయుగుండం తుపానుగా మారనున్న నేపథ్యంలో విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications