విశాఖపట్నం పోలింగ్ కేంద్రాలపై స్పెషల్ ఫోకస్: వాళ్లకు చెక్

Visakhapatnam Police: ఏపీలో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సరిగ్గా ఈ ఉదయం 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ ఆరంభం కానుంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు.

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.

Vizag police deploying constables with body worn cameras

విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టిని సారించారు పోలీసు అధికారులు. పోలింగ్ విధుల్లో పాల్గొంటోన్న పోలీసులు, ఇతర భద్రత సిబ్బందికి కొత్తగా బాడీ వార్న్ కెమెరాలను అమర్చారు. ఈ తరహా ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి. పోలీసుల శరీరాలపై ఈ కెమెరాలను అమర్చారు. వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానించారు.

కొన్ని సమస్యాత్మత, సున్నిత పోలింగ్ స్టేషన్ల వద్ద విధి నిర్వహణలో ఉండే పోలీసులు, భద్రత సిబ్బందికి ప్రత్యేకంగా వీటిని అమర్చారు. దీని పనితీరుపై విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యనార్ వివరించారు. ఒక పోలింగ్ స్టేషన్‌లో ఏం జరుగుతోందనేది బాడీ వార్న్ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే స్పష్టంగా చూడొచ్చని అన్నారు.

Vizag police deploying constables with body worn cameras

ఏ పోలింగ్ కేంద్రం వద్దనైనా గుమికూడి ఉండటం, గుంపుగా బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటే.. కంట్రోల్ రూమ్ నుంచే నేరుగా బాడీ వార్న్ కెమెరాలను ధరించిన పోలీసులకు తాము ఈ సమాచారాన్ని అందజేయవచ్చని, వారితో మాట్లాడచ్చని అన్నారు.

అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు స్ట్రైకింగ్ ఫోర్స్, నాన్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందిని తక్షణమే సంబంధిత పోలింగ్ కేంద్రానికి పంపించవచ్చని, ఫలితంగా ఉద్రిక్త వాతావరణాన్ని వెంటనే అదుపు చేయవచ్చని రవిశంకర్ తెలిపారు. మొత్తంగా 300లకు పైగా బాడీ వార్న్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+