Vizag Steel plant: కేంద్రం యూటర్న్: ప్రైవేటీకరించట్లేదని ఎవరన్నారు?

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం యూటర్న్ తీసుకుంది. దీన్ని ప్రైవేటుపరం చేయట్లేదంటూ స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రకటించిన మరుసటి రోజే- దీనిపై వివరణ ఇచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన కొద్ది రోజులకే కేంద్రమంత్రి చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా మాటల యుద్ధానికి కూడా దారి తీసింది.

రెండు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతోన్న విషయం తెలిసిందే. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో అదే జాబితాలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కూడా చేర్చింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఇదివరకే ఎయిరిండియా, జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని అమ్మేసింది కేంద్ర ప్రభుత్వం.

 vizagsteelplant

భారత్ పెట్రోలియం, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ వంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకా మిగిలివున్నాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు చెందిన సేలం, దుర్గాపూర్, భద్రావతి ప్లాంట్లను ఇదివరకే అమ్మకానికి ఉంచింది. అదే జాబితాలో విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఉంచింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ఉద్యమించిన విషయం తెలిసిందే.

ఈ పరిణామాల మధ్య కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన ప్రకటన కలకలం రేపింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి తాము ముందుకు వెళ్లట్లేదని చెప్పారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను బలోపేతం చేస్తామని అన్నారు. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు. దీనిపై అర్‌ఐ‌ఎన్‌ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పారు.

 vizagsteelplant

ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఆ ప్రకటనను ఉపసంహరించుకుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను కొనసాగిస్తోన్నామని తెలిపింది. ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయని, వాటికి వివరణ ఇస్తోన్నామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ స్టీల్ ఫ్యాక్టరీని తమ తరఫు నుంచి మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+