viral video:వావ్.. సీతక్క, విద్యార్థికి మోడ్రన్ కటింగ్ చేసి..
సీతక్క.. ఎమ్మెల్యే అయినా చాలా సింపుల్‌గా ఉంటారు. జనంతో కలిసే ఉంటారు. మేడారం జాతర.. ఇతర కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు. అంటే సర్వీస్ చేస్తారు. తానేంటి ఎమ్మెల్యేనని అనుకోరు. నిరాడంబర జీవితానికి మారుపేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క. ప్రజాప్రతినిధి అన్న పదానికి సరైన నిర్వచనంలా ఆమె ప్రజల్లోనే ఉంటారు. ప్రజలతోనే ఉంటూ.. వారి మంచి చెడులను అడిగి తెలుసుకుంటారు.

మోడ్రన్ హెయిర్ స్టైల్
సీతక్క కొందరు చిన్నారులకు మోడ్రన్ హెయిర్ స్టయిలింగ్ చేశారు. ఓ విద్యార్థికి చక్కగా కట్ చేశారు. అతను అద్దం పట్టుకుంటే ఆమె హెయిర్ కట్ చేశారు. అతనితో మాట మంతీ మాట్లాడారు. పక్కన వాగులో మిగతా పిల్లలు కూడా ఉన్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో ఓ చిన్న కుంట వద్ద ఆగారు. వారితో మాట కలిపారు.
కత్తెర పట్టిన సీతక్క
కత్తెర చేతబూని కొందరు చిన్నారులకు లేటెస్ట్ మోడల్ క్రాఫు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె స్వయంగా పంచుకున్నారు. నగరాల్లో పెద్ద పెద్ద భవంతులు ఉంటాయని, సదుపాయాల ఉంటాయని సీతక్క పేర్కొన్నారు. చిన్న చిన్న కుంటల్లో స్నానం చేయడం, సహచరులతో కలిసి ఆడుకోవడం వంటి ఆనందాలను నగరాలు ఇవ్వలేవని అభిప్రాయపడ్డారు. ఎంతయిన గ్రామాలు గ్రామాలేనని తెలిపారు.

ఫైర్ బ్రాండ్ ఇలా..
రచ్చబండకు వెళుతుండగా ఈ పిల్లలను చూడగానే పాత జ్ఞాపకాలు మనసులో మెదిలాయని వివరించారు. అందుకే ఆగి.. వారితో కాసేపు గడిపానని తెలిపారు. అలా ఒకతనికి కటింగ్ చేశానని ఆమె వివరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చాలా మంది శభాష్ సీతక్క అంటున్నారు. మరో మంచి పని చేశావ్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సీతక్క అంటే ఫైర్ బ్రాండ్.. ఇతర పక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తారు. అలాగే పేదలతో మంచిగా కలిసిపోతుంటారు. ఇవే అంశాలు ఆమెకు మరింత మంచి పేరు తీసుకొస్తున్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications