టూత్ బ్రష్ వర్సెస్ బూట్ పాలీష్: బండి సంజయ్‌పై కడియం శ్రీహరి గరం
టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. బీజేపీ చీఫ్ బండి సంజయ్.. గులాబీ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. దీనికి ధీటుగా గులాబీ దళం కూడా తిప్పికొడుతోంది. టీఆర్ఎస్ నేతలు టూత్ బ్రష్ గాళ్లు అని సంజయ్ విరుచుకుపడ్డారు. దీనికి ధీటుగా కడియం శ్రీహరి స్పందించారు. మరీ మీరు ఏంటీ అని ఫైరయ్యారు. మీరు చేసే కామెంట్లను ప్రజలు గమనిస్తున్నారని.. తగిన గుణపాఠం చెబుతారని మండిపడ్డారు.
Recommended Video

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌పై ఎమ్మెల్సీ కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము టూత్ బ్రష్ గాళ్లమైతే మీరు బూటు పాలిష్ గాళ్లా అని ఎద్దేవా చేశారు. ఎందుకు నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్మార్ట్ సిటీ నిధుల్లో అవినీతి జరగలేదని.. భద్రకాళీ టెంపుల్ ఎందుకు.. ప్రెస్‌క్లబ్‌లో చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు. తన ఛాలెంజ్ స్వీకరించేందుకు సిద్దమా అంటూ ప్రశ్నించారు. భద్రకాళీ, భాగ్యలక్షీ ఆలయాల్లో రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని కడియం శ్రీహరి తేల్చిచెప్పారు. బీజేపీ నేతల మాటలను ప్రజలు విశ్వసించరని అన్నారు. ఇదీ క్రమంగా తెలుస్తోందని చెప్పారు. కాషాయ నేతలకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తు ఊరుకోమని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో వీర్రవీగొద్దని.. అయినా బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య సింగిల్ డిజిట్ దాటలేదని చెప్పారు. ఆ విషయం ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని కోరారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications