వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింహాం మీద స్వారీ, దళితబంధు అమలు చేయకుంటే నష్టం: కడియం శ్రీహరి

|
Google Oneindia TeluguNews

మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దళితబంధు అమలు చేయకుంటే.. ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత తమ ప్రభుత్వం ఎదుర్కొవాల్సి వస్తోంది. అధికార పార్టీ నేత ఇలా కామెంట్ చేయడం చర్చానీయాంశమైంది. మాజీ డిప్యూటీ సీఎం.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్ చేశారు. ఆయన జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృస్త్షజిగూడెంలో మీడియాతో మాట్లాడారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టే క్రమంలో.. డిఫెన్స్‌లో పడ్డట్టు అనిపించింది.

 సెన్సేషనల్ కామెంట్స్

సెన్సేషనల్ కామెంట్స్

ఏడేళ్ల ఏం చేయలేదు, ఏ పథకం కూడా అమలు చేయలేదు అని విపక్షాలు కామెంట్ చేస్తున్నాయని కడియం శ్రీహరి స్పీచ్ స్టార్ట్ అయ్యింది. దళిత బంధు పథకంపై పూర్తిగా అధ్యయనం చేశామని వివరించారు. అన్నీ దృష్టిలో పెట్టుకునే పథకం ప్రారంభించబోతున్నామని చెప్పారు. పథకం అమలు చేయకుంటే దళితుల వ్యతిరేకతను మూట గట్టుకోవాల్సి వస్తోందని అంగీకరించారు. దీనిని విపక్షాలు తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 5,6 ఏళ్లలో 15 లక్షల కుటుంబాలకు లబ్ది కలుగుతుందని చెప్పారు. ఏడాదికి 25 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని వివరించారు. ఇదివరకు నీటి పారుదల రంగం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశామని తెలిపారు. దళిత బంధు పథకం అనేది సింహాం మీద స్వారీ లాంటి దాని హాట్ కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం, పార్టీకే నష్టం అని అంగీకరించారు. ఆరోపణలు చేసే ముందు విపక్షాలు చౌకబారు విమర్శలు చేయడం సరికాదన్నారు.

లాంఛనంగా ప్రారంభం..

లాంఛనంగా ప్రారంభం..

మరోవైపు హుజురాబాద్ పరిధిలో గల శాలపల్లి ఇందిరానగర్‌లో సోమవారం దళితబంధు పథకాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారు. 15 మంది లబ్దిదారులకు సీఎం కేసీఆర్ చెక్కులను అందజేస్తారని సీఎస్ సోమేశ్ కుమార్ తెలియజేశారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. మిగతా వారు ఆందోళన చెందొద్దు అని చెప్పారు. గ్రామ సభల ద్వారా దళితబంధు సాయం పంపిణీ చేస్తామని చెప్పారు. మరోవైపు బీజేపీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి హరీశ్ రావు పైరయ్యారు. ఓటమి భయంతోనే ప్రజలను రెచ్చగొట్టేలా బీహెవ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అర్హులు అందరికీ పథకం అందజేస్తామని చెప్పారు. దళిత బంధు పథకం కోసం రూ.2 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగితే ఎవరైనా ఆహ్వానిస్తారని చెప్పారు.

 ఆందోళనలు

ఆందోళనలు

ఇటు కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలం కనగర్తి గ్రామంలో దళితబంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు స్థానికులు పురుగుల మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దళితులు దగ్దం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కానీ తమపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాల్సిందే. లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరసనలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మార్పీఎస్‌ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొడ్డు దయాకర్‌ మాదిగ ఇటీవల హెచ్చరించారు. పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్‌, దళిత సంఘాల ఆధ్వర్యంలో వరంగల్‌లోని బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందాలని దయాకర్ మాదిగ అన్నారు. లేదంటే సెప్టెంబరు 5న హుజూరాబాద్‌లో దళిత గర్జన సభ నిర్వహించి ఆందోళన చేపడతామన్నారు.

 డెడ్ లైన్

డెడ్ లైన్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ ఈ నెల 31లోగా దళితబంధు పథకం ద్వారా రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ హసన్‌పర్తి మండల కార్యాలయం నిరాహార దీక్ష చేపట్టారు. ఎంఎస్ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ నరేశ్‌ దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దళితబంధు అమలు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తానన్న కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్‌లో 2 వేల కోట్లు ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని దళితులు ఆలోచించాలన్నారు. దళితబంధును ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

 పైలట్ ప్రాజెక్టు

పైలట్ ప్రాజెక్టు

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో వర్తింప చేస్తారు.

Recommended Video

Kadiyam Srihari challenges Bandi Sanjay మేము టూత్ బ్రష్ గాళ్లమైతే మీరు బూటు పాలిష్ గాళ్లు..!!
 విపక్షాల గుర్రు

విపక్షాల గుర్రు

దళిత బంధు పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.

English summary
ex deputy chief minister kadiyam srihari sensational comments on dalitha bandhu. if our government not Execution dalitha bandu loss to trs party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X