యంత్రాంగాన్ని కదిలించిన వృద్ధుల "లంచం కోసం బిచ్చం".. ఎమ్మార్వో సస్పెన్షన్
భూపాలపల్లి : లంచం ఇవ్వడానికి వృద్ధ దంపతులు భిక్షమెత్తుకుంటున్నారనే వార్త ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఆ ఘటన వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. లంచం అడిగిన ఇద్దరిపై వేటు వేశారు జిల్లా కలెక్టర్.
ఆజం నగర్ కు చెందిన మాంత బసవయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు, తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ ల కోసం రెండేళ్లుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆ క్రమంలో లంచం ఇస్తే తప్ప పని కాదని వీఆర్‌వో తో పాటు తహసీల్దార్ కూడా చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో భిక్షాటనకు దిగారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వృద్ధ దంపతులు భిక్షాటన చేస్తున్న దృశ్యం మీడియా కంటపడటంతో విషయం వెలుగుచూసింది. ఈ వార్తను వన్ ఇండియా తెలుగు వెబ్ సైట్‌తో పాటు మీడియా మొత్తం పబ్లిష్ చేసింది. ఆ విషయం తెలంగాణ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.

లంచం కోసం వృద్ధ దంపతులు భిక్షాటన చేస్తున్నారనే వార్తతో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పందించారు. సమస్య పరిష్కారించాలంటూ భూపాలపల్లి ఆర్డీవోను ఆదేశించారు. దీంతో తన కార్యాలయానికి పిలిపించి 4 ఎకరాల 10 గుంటలకు సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ ఆ వృద్ధ దంపతులకు అందించారు ఆర్డీవో వెంకటాచారి. మిగతా 5 ఎకరాల 7 గుంటలకు సంబంధించిన భూమి వివాదంలో ఉందని, పూర్తిగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ అందిస్తామని తెలిపారు. అదలావుంటే లంచం పేరుతో వృద్ధ దంపతులను పీడించిన వీఆర్‌వో శ్రవణ్, తహసీల్దార్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు కలెక్టర్.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications