VIRAL:వీడు మాములోడు కాదు.. సింహానికి పాలు పడుతూ, వైరల్..
సింహాం తలను ఓ మహిళ నిమిరిన వార్త నిన్ననే తెలుసుకున్నాం. కదా.. ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వచ్చింది. అవును ఒకతను సింహనికి పాలు పట్టిస్తున్నాడు. అదేమో పడుకొని.. తాగేందుకు ట్రై చేస్తోంది. మనోడెమో నవ్వుతూ ఫోజిచ్చాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. మీరు చూడండి.

66కే వ్యూస్
లయన్ టోల్డ్ పేరుతో ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 66కే వ్యూస్ వచ్చాయి. సింహాం పడుకొని ఉండగా.. దానికి పాలు పడుతున్నాడు. ఏ మాత్రం భయం లేకుండా ున్నారు. ఆ సింహాం కూడా అలానే చక్కగా ఉంది. వీడియో చూసిన వారికే భయం కలుగుతుంది.. కానీ అతను మాత్రం చక్కగా ఉన్నాడు. వీడియోను ఈ నెల 24వ తేదీన షేర్ చేశారు. నెటిజన్లు వేగంగా కామెంట్స్ చేస్తున్నారు.

బొమ్మలు కాదు..
సింహాలు బొమ్మలు కాదని ఒకరు రాశారు. అతను డేంజరస్ ఫిట్ చేశారని మరొకరు రాశారు. కానీ అతను భయపడకుండా ఉన్నాడని తెలిపారు. ఇదీ చూడడానికే భయంగా ఉందని మరొకరు రాశారు. నిజమే.. దానిని సింహాం అనుకున్నాడో.. లేదంటే పిల్లి అనుకున్నాడో తెలియదు కానీ.. అతను మాత్రం చక్కగా ఉన్నాడు. చూసిన వారే భయపడుతున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసి.. అతని ధైర్య సాహాసాలను కనులారా వీక్షించండి.
ధైర్యం చేస్తున్నారు..
ఇటీవల వీడియోలు పోస్ట్ చేయడం.. లైకులు, కామెంట్లతో పోస్టులు నిండిపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ వారు ధైర్యంగా చేస్తున్న వీడియోలు.. చూసేవారికే ఒళ్లు జలదరిస్తోంది. ఇదీ నిజమేనా అనే సందేహాం కలుగుతుంది. సింహామే కాదు.. పులి, చిరుత, మొసలి, పైథాన్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications