కన్న కూతురినే కాటేసిన మానవ మృగం .. గర్భం దాల్చటంతో వెలుగులోకి వచ్చిన దారుణం

విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతమైన భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన తండ్రి, కన్నకూతురినే కాటేశాడు. కామం కళ్లను కప్పేయడంతో కోరిక తీర్చుకోడానికి స్వయంగా కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాదు ఏకంగా కన్నబిడ్డనే గర్భవతిని చేసాడో పాపిష్టి తండ్రి . సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ దారుణం పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

కన్న కూతురిపై అత్యాచారం చేసిన కామపిశాచి తండ్రి

కన్న కూతురిపై అత్యాచారం చేసిన కామపిశాచి తండ్రి

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన దారుణం ఇది . ఇక వివరాల్లోకి వెళితే..పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం అరుంధతిపేటకు చెందిన ఓ వ్యక్తి కన్న బిడ్డపైనే పైశాచిక క్రీడకు ఒడిగట్టాడు . నిత్యం మద్యం సేవించి ఇంటికి వస్తున్న వేధింపులకు గురి చేస్తున్న భర్తతో వేగలేక ఓ భార్య నరకయాతన అనుభవించింది. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్న క్రమంలో భర్తతో గొడవ జరిగినప్పుడల్లా భార్య తన పుట్టింటికి వెళ్లేది. ఒక్కోసారి తమ కుమార్తెను తండ్రి వద్దనే వదిలిపెట్టి వెళ్లేది. ఇదే అదనుగా తీసుకున్న ఆ కామాంధుడు కన్నకూతురిపైనే దారుణం చేశాడు.

బాలిక గర్భవతి కావటంతో వెలుగులోకి వచ్చిన దారుణం

బాలిక గర్భవతి కావటంతో వెలుగులోకి వచ్చిన దారుణం


ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి కూతురిపై అత్యాచారం చేసేవాడు. కాపాడాల్సిన తండ్రే అలా చేస్తుంటే దిక్కుతోచని స్థితిలో బాలిక అల్లాడిపోయింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా ఆ చిన్నారి అనారోగ్యంగా ఉండటంతో ఆమె తల్లి శనివారం ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి.. బాలిక గర్భవతి అని తేల్చారు.ఈ దారుణానికి కారణం తన భర్తేనని అనుమానించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తండ్రిని అరెస్ట్ చేసి చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

 కఠిన శిక్షలు అవసరం .. పైశాచిక తండ్రుల నీడన కూడా బిడ్డల మనుగడ కష్టం

కఠిన శిక్షలు అవసరం .. పైశాచిక తండ్రుల నీడన కూడా బిడ్డల మనుగడ కష్టం

రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అన్న విచక్షణ మరిచి పశువుల్లా తండ్రులు ప్రవర్తిస్తున్న ఘటనలు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. సమాజంలో రక్త సంబంధాలకు, అనుబంధాలకు కూడా విలువలు లేకుండా పోతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా మన సమాజం ఎటు వైపు పయనిస్తుంది అన్న అనుమానం కలుగుతుంది. ఇలాంటి దారుణాలకు చెక్ పెట్టాల్సిన అవసరం వుంది. ఇంత దారుణంగా పశువుల్లా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన శిక్షలు అమలు చెయ్యకుంటే ఇలాంటి పైశాచిక తండ్రుల నీడన కూడా బిడ్డలా మనుగడ ప్రశ్నార్ధకమే అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+