రో‘హిట్’కు ఏమైంది..? ఏంటీ ఈ వరస ఫెయిల్యూర్స్.. ఇదీ ముంబై ఇండియన్సేనా..?
ఐపీఎల్ 2022 సీజన్ ఫేవరేట్ అంటే.. అంతా దాదాపు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అని అంచనా వేశారు. ఢిల్లీ పర్లేదు.. ఆ జట్టు విజయాలను సాధిస్తోంది. ఇక చెన్నై, ముంబై గురించి అయితే చెప్పనవసరం లేదు. చెరో జట్టు 4 మ్యాచుల చొప్పున ఓడిపోయాయి. చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజా ఇటీవలే బాధ్యతలు తీసుకున్నాడు.. ధోని వద్దనడంతో ఛాన్స్ వచ్చింది. కానీ విజయాలు మాత్రం దక్కడం లేదు. దీనిపై చాలా సూచనలు చేస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. వరసగా కప్స్ కూడా తెచ్చిపెట్టాడు.

రోహిత్‌పై ఒత్తిడి..?
ఇటీవలే వన్డే, టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. అంతకుముందే టీ 20 జట్టు నాయకత్వ బాధ్యతలను చూస్తున్నాడు. అతనిపై ఒత్తిడి ఏమో కానీ.. ఐపీఎల్ 2022 సీజన్‌లో రాణించింది కూడా లేదు. దీంతో అతనిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలనే కొందరు అంటున్నారు. రచ్చ జరగడంతో హిట్ మ్యాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో మాట్లాడాడు. జోష్ నింపే ప్రయత్నం చేసినా.. నిన్నటి మ్యాచ్‌లో ఫలితం రాలేదు. అతను కూడా పెద్దగా రాణించలేదు. దీంతో మళ్లీ విమర్శలు వస్తున్నాయి.

అప్పుడు ఓకే.. కానీ
టీ 20, వన్డే, టెస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచులకు హిట్ మ్యాన్ బాగానే కెప్టెన్సీ చేశాడు. గత సీజన్ వరకు ఫర్లేదు.. కానీ ఆ సీజన్ చివరి నుంచి జట్టును ఓటమిలు వెంటాడుతున్నాయి. ఆ సమయంలో కూడా ఫెవరేట్ ఉండే.. కానీ ఫైనల్ వరకు రాలేకపోయింది. ఇక ఇప్పుడు ఆదిలోనే హంసపాదు అన్నట్టు.. వరసగా ఫెయిల్యూర్ వస్తున్నాయి. అయినప్పటికీ తమ విజయంపై జట్టు మేనెజ్ మెంట్, టీమ్ విశ్వాసంలో ఉంది.

ఓకే.. కానీ... ఆల్ ద బెస్ట్
నిజానికి రోహిత్ శర్మపై ఒత్తిడి ఉండి ఉంటది. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు సంబంధించి 3 ఫార్మాట్‌లకు కెప్టెన్సీ అంటే మాటలు కాదు.. ఐపీఎల్ కూడా అదే క్రేజ్.. సో అతను ప్రెషర్‌కు గురవుతున్నాడు. ఇటీవల ఓ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఒత్తిడికి గురయితే ఎలా ఉంటుందో చూడాలనీ అనుకున్నాడు.. కానీ ఓటములతో మాత్రం మరింత ఫ్రెషర్ అనుభవిస్తున్నాడు. ఇప్పటివరకు అయినా దానిని సవాల్‌గా తీసుకొని.. ముందు ముందు జట్టు విజయాలు సాధించాలని ఎంఐ, రోహిట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications