ఫైనల్స్ పోరుకు సన్నద్ధమౌతోన్న వేళ- గాయపడ్డ రోహిత్ శర్మ
లండన్: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇంకో మూడు రోజులు.. అంతే. ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్-ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధమౌతున్నాయి. రెండేళ్లకోసారి జరిగే ప్రతిష్ఠాత్మక ఫైనల్ ఇది. 2021లో సౌథాంప్టన్‌లో జరిగిన లో- స్కోర్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా.
ఆ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది న్యూజిలాండ్. ఇప్పుడు న్యూజిలాండ్ ఫైనల్స్‌లో లేదు. టెస్టుల్లో నిలకడగా రాణించిన టీమిండియా ఈ ఏడాది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరుకుంది. తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుంది. ప్రత్యర్థిగా న్యూజిలాండ్ స్థానంలో ఆస్ట్రేలియా వచ్చింది. ఫైనల్స్‌లో భారత జట్టును ఎదుర్కొనబోతోంది. ఈ రెండింట్లో ఏది గెలిచినా- డబ్ల్యూటీసీ టైటిల్‌ను సాధించిన మొదటి జట్టవుతుంది.

ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. లండన్‌లోని ఓవల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఆస్ట్రేలియాను ఎదుర్కొనబోయే టీమిండియాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడబోతోంది భారత్. గాయపడ్డ ఓపెనర్ కేఎల్ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు జట్టులో చోటు దక్కింది.
అంతా సజావుగా సాగుతోందనుకుంటోన్న వేళ.. భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. తెల్లవారితే ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానున్న ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ శర్మ గాయపడ్డాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో అతని వేలికి గాయమైంది. బౌలర్ సంధించిన బంతి నేరుగా అతని గ్లోవ్స్‌ను తాకింది. దూసుకొచ్చిన బంతి రోహిత్ శర్మ కుడి బొటన వేలిని బలంగా తాకింది. కొద్దిసేపు నొప్పితో విలవిల్లాడాడు.
Rohit Sharma has got stuck in his left thumb while batting at the nets. (Reported by OneCricket). pic.twitter.com/XYTKh7TYyd
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 2023
గ్లోవ్స్‌ను తీసేసి, వేలికి మెడికేటెడ్ ప్లాస్టర్ అంటించుకున్నాడు. టీమిండియా ఫిజియోథెరపిస్ట్ అతనికి పెయిన్ కిల్లర్‌ను ఇచ్చాడు. నెట్స్ నుంచి వెళ్లిపోయాడు రోహిత్ శర్మ. మళ్లీ నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. ఇది కాస్తా టీమిండియాలో ఆందోళనకర వాతావరణానికి దారి తీసింది. గాయం తాజా పరిస్థితిపై జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ అప్‌డేట్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి- గాయం తీవ్రత తక్కువేనని తెలుస్తోంది.
కాగా- టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ తనదైన ముద్రను వేశాడు. అత్యధిక బ్యాటింగ్ యావరేజ్‌ను నమోదు చేశాడు. 2019- 2021 సీజన్‌లో బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ అతనిదే. ఆ సీజన్‌లో 60.8 శాతం బ్యాటింగ్ యావరేజ్‌ను అందుకున్నాడు. 2021-23 సీజన్‌లోనూ అదే దూకుడును ప్రదర్శించాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ యావరేజ్ 43.8 శాతం. ఓవరాల్‌గా 52.76 శాతం బ్యాటింగ్ యావరేజ్‌ను రికార్డ్ చేశాడు.












Click it and Unblock the Notifications