డబ్బులిస్తా.. వారం నాతో గడుపుతావా? ఆట సందీప్ కు అమ్మాయి ఆఫర్

ఆట సందీప్... ప్రస్తుతం ఈ పేరు తెలుగు సినీరంగంలో చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీలో చిరు వేసిన హుక్ స్టెప్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా ఈ స్టెప్ వేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూసుకుని అభిమానులు కూడా మురిసిపోతున్నారు. దాంతో ఆట సందీప్ పేరు తెలుగునాట మారుమోగుతోంది. ఇన్నాళ్లూ తాను పడిన కష్టానికి తగిన ప్రతిఫలానికి, తనకు జరిగిన అవమానాలకు సరైన ఫలితం దక్కిందని ఆట సందీప్, అతని భార్య జ్యోతిరాజ్ అంటున్నారు. ఇదే సమయంలో పలు ఛానెల్స్‌కు ఈ దంపతులు ఇంటర్వ్యూలు ఇస్తూ తమ కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇతర విషయాలను పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

42 కోట్లు రికవరీ చేయండి.. వివాదంలో శంకర వరప్రసాద్ కలెక్షన్లు.. హైకోర్టులో పిటిషన్

ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఆట మొదటి సీజన్‌లో పాల్గొని తన ప్రతిభతో ఆ సీజన్‌కు విన్నర్‌గా నిలిచాడు. అప్పటి నుంచి అతనిని అభిమానులు ఆట సందీప్‌గా పిలుచుకుంటున్నారు. ఈ పాపులారిటీతోనే బిగ్‌బాస్ తెలుగులో అతనికి అవకాశం దక్కింది. బిగ్‌బాస్‌తో మరింత పాపులరైన సందీప్.. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ, చిరు స్టెప్స్‌కు డ్యాన్స్‌లు వేస్తూ పెరిగాడు. ఇతని భార్య జ్యోతిరాజ్ కూడా డ్యాన్స్ మాస్టరే. వీరిద్దరూ కలిసి పలు హిట్ సాంగ్స్‌కి డ్యాన్స్‌లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడుతూ పాపులారిటీ సంపాదించారు.


Aata Sandeep Opens Up on Casting Couch Experience Shocking Messages and Firm Rejection

సందీప్ కొరియోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేకపోయాడు. కొద్దిరోజుల క్రితం హీరోగానూ తన అదృష్టం పరీక్షించుకున్నా లక్ కలిసిరాలేదు. అయినప్పటికీ ఎక్కడా నిరుత్సాహపడకుండా రీ2ల్స్ చేస్తూ ముందుకు సాగింది ఈ జంట. డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేసి కుర్రాళ్లకు డ్యాన్స్ నేర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ డ్యాన్స్ రీల్ చూసిన ఛాంపియన్ మూవీ నిర్మాత స్వప్నాదత్ అతనిని సంప్రదించారు.

CCL 2026: సిక్సర్లతో పంజాబ్ విధ్వంసం... చిత్తుగా ఓడిపోయిన భోజ్‌పురి దబాంగ్స్

రోషన్ మేకా.. అనస్వర రాజన్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో గిరగిర.. గింగిరానివే సాంగ్‌కు కొరియోగ్రాఫి చేశారు ఆట సందీప్. ఆ పాట బాగా పాపులర్ అయ్యింది. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి కంట్లో పడటంతో.. సందీప్ - జ్యోతిలను ఇంటికి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు చిరు. అలా మన శంకర వరప్రసాద్ గారు మూవీలో హుక్ సాంగ్‌కి కొరియోగ్రఫి చేసిన సందీప్.. చిరంజీవి నమ్మకాన్ని నిలబెట్టుకుని టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంటా బయటా ప్రశంసలు, అవకాశాలతో దాదాపు 18 ఏళ్ల తర్వాత విజయం వరించడంతో సందీప్, జ్యోతిరాజ్‌లు పొంగిపోతున్నారు. దాంతో సందీప్‌కు సంబంధించని పాత వీడియో క్లిప్పింగ్‌లు వైరల్ అవుతున్నాయి.

ఆ జబర్దస్త్ యాంకర్ ఒక విలన్.. స్టార్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్

అయితే ఇదంతా జరగడానికి కొద్దినెలల క్రితం ఆట సందీప్ - జ్యోతిరాజ్‌లు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటనను పంచుకున్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి యాంకర్ ప్రశ్నించగా.. సందీప్ స్పందించారు. డబ్బులిస్తామని చాలామంది చెప్పారు. అది కూడా పర్సనల్‌గానే. రీసెంట్‌గా ఒక వన్ వీక్ బ్యాక్ కూడా ఓ మెసేజ్ వచ్చింది.. అది ఇప్పటికీ నా సెల్‌లో ఉంది. అమెరికా నుంచి వచ్చాను.. ఇక్కడ ఉంటున్నాను, వన్ వీక్ ఎంజాయ్ చేయాలి. డబ్బులిస్తా అన్నట్లుగా ఒక మెసెజ్ పెట్టింది. నాకు ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, నాకేమీ అర్ధం కాలేదు. నీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అని చాలా పద్ధతిగా కార్పోరేట్ స్టైల్‌లో నీట్‌గా అడిగారు. దాంతో నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేశా. ఆ తర్వాత మళ్లీ రెండ్రోజులకు ఇంకో మెసేజ్ వచ్చింది. నీకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలన్నా ఇస్తానని సేమ్ వ్యక్తి మళ్లీ ఆఫర్ ఇచ్చింది. సారీ.. నాకు ఇంట్రెస్ట్ ఏం లేదని నెంబర్ బ్లాక్‌లో పెట్టేశానని ఆట సందీప్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Credit: Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+