అమెరికాలో మరో తెలుగు సంఘం
తానా ఒక వర్గానికి, ఆటా మరో వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కానీ తెలుగు వారందరినీ ఒక వేదిక మీదికి తెచ్చే ఉద్దేశంతో యునైటెడ్ తెలుగు అమెరికన్ అసోసియేషన్ (యూటా) ఏర్పాటైంది. అమెరికాలో తెలుగు మాట్లాడే ప్రజలను ఐక్యం చేసేందుకు చురుకైన, పారదర్శకమైన సంఘాన్ని నిర్మించాలన్న స్వప్నంతో, దృష్టితో యునైటెడ్ తెలుగు అమెరికన్ అసోషియేషన్ (యూటా)ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ కార్యనిర్వాహక వర్గం ప్రకటించింది. అమెరికాలో నివసిస్తున్న పలువురు తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షల నుండి ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పాటుకు సహకరించిన తెలుగు ప్రజలందరికి కార్యనిర్వాహక వర్గం ధన్యవాదాలు తెలియజేస్తోంది.
పలు తెలుగు సంఘాలు ఉండగా కొత్తగా మరో సంఘం ఏర్పడడానికి కారణాన్ని వివరిస్తూ-చురుకైన, పారదర్శకమైన సంఘాన్ని నిర్మించడమే ఏకైక లక్ష్యంగా యూటా సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆ కార్యనిర్వాహక వర్గం తెలిపింది. ఈ నూతన సంఘం ఇప్పటికే ఉనికిలోని సంఘాల్లో సాంప్రదాయకంగా వస్తున్న ధోరణులను వదలిపెట్టి, రాజకీయ, పక్షపాత వైఖరులకు అతీతంగా నిక్కచ్చిగా పిల్లలకు, యువతకు సహాయం చేస్తుంది. నూతన తరాలకు వారి జాతి మూలాలను అర్ధం చేయించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు రాబోయే కొద్ది వారాల్లో అట్టా ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహక వర్గం తెలిపింది.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు పెద్ద ఎత్తున తెలుగు ప్రజలను సమీకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యూటా సంఘంలో జీవితకాల సభ్యత్వం తీసుకోవలసిందిగా అమెరికా తెలుగు ప్రజలను కారుతున్నాము. అదే విధంగా మీరు జీవితకాల సభ్యత్వం తీసుకోవడమే కాకుండా మీ కుటుంబ సభ్యులను, బంధు మిత్రులను ఈ సంఘంలో చేరేందుకు ప్రోత్సహించాలని కోరుతున్నట్లు కార్యనిర్వాహక వర్గం తెలిపింది. హైస్కూల్ పూర్తి చేసిన విద్యార్దులు ఈ సంస్థ విద్యార్థి సభ్యులుగాను, యువజన సభ్యులుగాను చేరవచ్చు. సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు, నిబంధనలు, నియమావళి, మరి ఇతర వివరాలు తెలుసుకోరే వారు www.utaaworld.org వెబ్ సైట్ ను సందర్శించమని వారు కోరారు. సభ్యత్వ నమోదు ఫారాలు, నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలు రిజిస్టర్ సెక్షన్ లో వివరించడం జరిగింది. మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను [email protected] ద్వారా సంప్రదించవలసి ఉంటుంది.
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు!












Click it and Unblock the Notifications