ఎన్నారై బాలిక స్పెల్లింగ్ బీ విజేత
వాషింగ్టన్: అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరిగే అమెరికా జాతీయ స్పెల్లింగ్ బీ ఛాంపియన్ షిప్ ను 2009 సంవత్సరానికి గాను ఓ ప్రవాస భారతీయ బాలిక కావ్య శివశంకర్ గెలుచుకుంది. కాన్సాస్ రాష్ట్రంలోని ఓలితెకు చెందిన కావ్య గత రాత్రి జరిగిన ఫైనల్ పోటీల్లో అమెరికాకు చెందిన టిమ్ రూయిటర్ పై విజయం సాధించింది. ఈ పోటీల ప్రాథమిక ఎంపికలో దేశవ్యాప్తంగా 11 మిలియన్ల విద్యార్థులు పాల్గొన్నారు. ఫైనల్స్‌కు 293 మంది ఎంపికయ్యారు. అందులో 32 మంది ప్రవాస భారతీయుల పిల్లలే కావటం విశేషం. ఈ పోటీల్లో పదేళ్ల కాలంలో 7 సార్లు ప్రవాసభారతీయుల పిల్లలే గెలుపొందటం గమనార్హం. ఈ పోటీలో విజేతకు 40 వేల అమెరికన్ డాలర్ల ప్రైజ్‌మనీతో పాటు లక్ష అమెరికన్ డాలర్ల విలువైన స్కాలర్‌షిప్పు లభిస్తుంది.












Click it and Unblock the Notifications