ఎన్నారై తెలుగు యువతకు పోటీలు

డిబేట్, క్విజ్, మిమిక్రి, మైమ్, డాన్స్, హాస్యం, పాటల పోటీలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. విజేతలను 2011వ తానా సమావేశాల్లో సత్కరిస్తామని తానా అధ్యక్షుడు జయరాం కోమటి తెలిపారు. తెలుగు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, తెలుగు ఏదేశమేగినా, తెలుగు మాతృభూమి అభివృద్ధికోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. తెలుగు భాషా, సంస్కృతులను కాపాడతామని చెప్పారు. తెలుగు ఫర్ ఎవ్విరి వన్' పేరిట నిర్వహించే తెలుగు భాష అభ్యసన కార్యక్రమంలో భాగంగా తెలుగు నేర్చుకునే వారికి సరైన బోధనా విధానాలను అందుబాటులో ఉంచుతున్నట్లు, ఆరోగ్య బీమా సౌకర్యం లేని తెలుగు వారికి సహాయం చేసేందుకు 'తానా ఫిజీషియన్స్ నెట్ వర్క్' లాంటి పలు సేవా కార్యక్రమాలను తమ సంస్థ నిర్వహిస్తున్నదని తెలిపేందుకు సంతోషంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications